Benefits Of Kalonji: చుండ్రు, ఆస్తమా తగ్గించే కలోంజీ.. ఎలా వాడాలంటే..-know what are the health benefits of kalonji for hair to body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Benefits Of Kalonji: చుండ్రు, ఆస్తమా తగ్గించే కలోంజీ.. ఎలా వాడాలంటే..

Benefits Of Kalonji: చుండ్రు, ఆస్తమా తగ్గించే కలోంజీ.. ఎలా వాడాలంటే..

HT Telugu Desk HT Telugu
Dec 12, 2023 06:45 PM IST

Benefits Of Kalonji: కలోంజీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

కలోంజీ ప్రయోజనాలు
కలోంజీ ప్రయోజనాలు (freepik)

మనం జీలకర్రను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఆహారాల్లో భాగంగా తీసుకుంటూ ఉంటాం. అయితే నల్ల జీల కర్రను మాత్రం పెద్దగా వాడం. దీన్నే కలోంజీ అనే పేరుతోనూ పిలుస్తారు. అన్ని షాపుల్లోనూ ఇది తేలికగా దొరుకుతుంది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు. అవన్నీ తెలిస్తే మీరూ తప్పకుండా దీన్ని వాడే ప్రయత్నం చేస్తారు. అవి తెలియాలంటే ఇది చదివేయండి.

కలోంజీ ప్రయోజనాలు :

  • పరగడుపున అర టీ స్పూను కలోంజీ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలా మందికి వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు తప్పకుండా కలోంజీ తినాలని ఆయుర్వేదం చెబుతోంది.
  • దీన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా, జలుబు, దగ్గు లాంటివి తగ్గుమఖం పడతాయి.
  • మలబద్ధకం ఉన్న వారు దీన్ని తరచుగా ఆహారంలో భాగంగా చేసుకుని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సమస్య తగ్గుతుంది.
  • దీన్ని తినడం వల్ల మొటిమల సమస్యలు తగ్గుతాయి.
  • దీనిలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొవ్వుల్ని పెంచే గుణాలు ఉన్నాయి. అందువల్ల ఊబకాయం, రక్త పోటు లాంటి సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.
  • కొందరికి చుండ్రు బాధ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు దీన్ని నానబెట్టి ముద్దలా చేసి కుదుళ్లకు పట్టించాలి. దీంతో చుండ్రు బాధ తగ్గడంతో పాటుగా జుట్టు కుదుళ్లు కూడా దృఢంగా మారతాయి.
  • రక్తంలో చక్కెరలు అనియంత్రితంగా ఉండటం వల్ల చాలా మందికి మధుమేహం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి వారు బ్లాక్‌ టీతో పాటు నల్ల జీలకర్రను పరగడుపున తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
  • చాలా మందికి రకరకాల పళ్ల సమస్యలు ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, పళ్ల నొప్పి లాంటివి ఉంటాయి. ఇలాంటి వారు కలోంజీ నూనెను అర టీ స్పూను మోతాదుగా తీసుకోవాలి. దీన్ని కొద్దిగా పెరుగులో కలిపి రోజుకు రెండు సార్లు చొప్పున రాసుకుంటూ ఉండాలి. పంటి సమస్యలన్నీ క్రమంగా తగ్గుతాయి.
  • ఆస్తమా ఉన్న వారికి ఊపిరి ఆడక చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. గోరు వెచ్చటి నీటిలో కలోంజీ నూనె, తేనెల్ని వేసి బాగా కలపాలి. రోజూ పరగడుపున దాన్ని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే అవసరానికి తగినట్లుగా ఈ కలోంజీగా పిలుచుకునే నల్ల జీలకర్రను వాడుకోవచ్చు. ఇంట్లో కాస్త సిద్ధంగా ఉంచుకుంటే సరిపోతుంది.

Whats_app_banner