Festive makeup: పండగ రోజు మెరిపించే మేకప్ ఇలా వేసుకోండి.. తక్కువ టైంలో బెస్ట్ లుక్
Festive makeup: పండగరోజు ప్రత్యేకంగా మెరిసిపోవాలంటే మంచి మేకప్ వేసుకోవాల్సిందే. దీనికోసం చేయితిరిగిన నైపుణ్యం అక్కర్లేదు. కొన్ని సింపుల్ హ్యాక్స్ తెల్సుకోండి చాలు.
పండగరోజు మేకప్ వేసుకోకపోతే ఎలా? అలానీ ఆ రోజు ఎక్కువ సమయమూ కేటాయించలేరు. కాబట్టి కొన్ని సింపుల్ హ్యాక్స్ తెల్సుకున్నారంటే మేకప్ వేయడం మరింత సులభం అవుతుంది. అవేంటో చూడండి.
మెరిసే లుక్ కోసం:
ముందుగా హైడ్రేటింగ్ ప్రైమర్ ఎంచుకోండి. దాన్ని ముఖం అంతటా రాసుకోండి. దానిమీద తేలికగా ఉండేలా లైట్ వెయిట్ ఫౌండేషన్ ఎంచుకోండి. డార్క్ సర్కిల్స్, నల్లటి మచ్చలు కనిపించకుండా ట్రాన్స్‌కులెంట్ పౌడర్ వాడండి. చివరగా హైలైటర్ వాడి ముక్కు అంచున, బుగ్గల మీద, నుదుటి మీద రాయండి. మంచి మెరుపు వస్తుంది.
స్మోకీ ఐ కోసం:
స్మోకీ ఐ మేకప్ చాలా మందికి నచ్చుతుంది. కానీ వేసుకోవడం కష్టమనుకుంటారు. ఇలా చేస్తే సులువే. ముందు క్రీమీ ఐషాడో స్టిక్ కను రెప్ప మీద రాయండి. దీనికోసం గ్రే, బ్రౌన్ లేదా నేవీ రంగులను ఎంచుకోండి. బ్రష్ సాయంతో చక్కగా బ్లెండ్ చేయండి. మస్కారా పెట్టుకోండి. న్యూడ్ లిప్ కలర్ వేసుకోండి. దీంతో న్యూడ్ మేకప్ లుక్ వస్తుంది.
లిప్ మేకప్:
బోల్డ్ మేకప్ లుక్ కోసం ముందుగా బీబీ క్రీమ్ లేదా లైట్ ఫౌండేషన్ రాసుకోండి. తర్వాత ఐబ్రో పెన్సిల్ సాయంతో కనుబొమ్మలు దిద్దండి. ఇప్పుడు కనురెప్పలకు మస్కారా రాసుకోండి. ఇప్పుడు ఎరుపు, గులాబీ, కోలర్ లాంటి రంగుల లిప్‌స్టిక్ ఎంచుకోండి. దీంతో దృష్టంతా పెదాల మీద పడుతుంది.
రంగుల ఐలైనర్:
కాస్త పండగ టచ్ మేకప్ లో ఎక్కువగానే కనిపించాలీ అనుకుంటే రంగులు వాడండి. ముందుగా లేతరంగు ఐషాడో లేదా కన్సీలర్ కనురెప్పల మీద రాసుకోండి. అలాగే నీలం రంగు, ఆకుపచ్చ రంగు, పర్పుల్ రంగుల్లో ఐలైనర్ వాడండి. దీంతో వింగ్ లాంటి లుక్ క్రియేట్ చేయండి. అలాగే మస్కారా పెట్టుకుంటే చాలు. చివరగా లేత రంగు లిప్ కలర్ వేసుకుంటే ఫెస్టివ్ మేకప్ పూర్తవుతుంది.
టాపిక్