Beauty tips: మేకప్‌కు ముందు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి, ఎక్కువసేపు ముఖంపై ఆయిల్ కంట్రోల్ అవుతుంది-apply this face pack before makeup to control oil on the face for a long time ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips: మేకప్‌కు ముందు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి, ఎక్కువసేపు ముఖంపై ఆయిల్ కంట్రోల్ అవుతుంది

Beauty tips: మేకప్‌కు ముందు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి, ఎక్కువసేపు ముఖంపై ఆయిల్ కంట్రోల్ అవుతుంది

Haritha Chappa HT Telugu
Sep 02, 2024 09:30 AM IST

Beauty tips: పండుగలు వస్తుంటే మహిళలు అందంగా కనిపించేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. మేకప్ వేసుకున్నా కూడా చర్మంపై చెమట, ఆయిల్ ఉత్పత్తి పెరిగిపోయి ఆ మెరుపు కనిపించదు. ముఖంపై మేకప్ తాజాగా ఉండాలంటే ముందుగా ఒక ఫేస్ ప్యాక్ ను వేసుకోండి. ఇది నేచురల్‌గా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది.

సింపుల్ ఫేస్ ప్యాక్
సింపుల్ ఫేస్ ప్యాక్ (pixabay)

జిడ్డు చర్మం కలవారు ఎంతో మంది ఉన్నారు. వారి సమస్య ముఖంపై ఆయిల్ ఉత్పత్తి కావడం. దీని వల్ల ఎంత అందంగా తయారైన కాసేపటికే జిడ్డు ముఖం అయిపోతుంది. వీరికి ముఖంపై మొటిమలు వచ్చే సమస్య కూడా ఎక్కువే. పండుగల సమయంలో కనీసం నాలుగైదు గంటలైనా ముఖానికి వేసుకున్న మేకప్ చెరిగిపోకుండా, జిడ్డు కారకుండా ఉండాలని కోరుకునే మహిళలు ఎంతో మంది. ఇలా ముఖంపై మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే మేకప్‌కు వేసుకోవడానికి ముందు ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇది చర్మంపై ఉన్న జిడ్డును నియంత్రిస్తుంది. ముఖాన్ని మెరిపించడంలో సహాయపడుతుంది. ఆయిల్ కంట్రోల్ ఫేస్ ప్యాక్ ఇంటి దగ్గరే తయారుచేసి వేసుకోవచ్చు.

ఆయిల్ స్కిన్ కారణంగా చర్మంపై కనిపించే జిడ్డు, మచ్చలు వంటివి ఇబ్బంది పెడతారు. అలాంటివారు టమోటాలతో చేసిన ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. టమోటాల్లో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ టానింగ్ ను తొలగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లతో పాటు, ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసే ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి.

ఆయిల్ కంట్రోల్ ఫేస్ ప్యాక్ తయారీ

టొమాటో రసం - రెండు స్పూన్లు

పసుపు - ఒక స్పూను

టొమాటో గుజ్జు - ఒక స్పూను

గోధుమపిండి - అర టీస్పూన్

టమోటా గుజ్జు ఒక గిన్నెలో వేయాలి. అందులోనే పసుపు, కొద్దిగా గోధుమపిండి కలపాలి. టమోటా రసం వేసి బాగా కలుపుకోవాలి. వీటిని మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసి ముఖం నుంచి మెడ వరకు అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను శుభ్రం చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ క్లీన్ చేయడానికి పలుచటి క్లాత్ ను నీటిలో నానబెట్టి ఆ నీటిని బాగా పిండుకోవాలి. చేతులతో ఈ వస్త్రాన్ని ముఖానికి రుద్ది ఫేస్ ప్యాక్ ను శుభ్రం చేసుకోవాలి.

టమోటాలతో ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం వెంటనే ప్రకాశవంతంగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను వరుసగా 3 నెలల పాటు అప్లై చేస్తే చర్మం బిగుతుగా కనిపిస్తుంది. కాబట్టి వినాయక చవితి, దసరా, దీపావళి వరుస పెట్టి పెద్ద పండుగల రాబోతున్నాయి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని మేకప్ వేసుకోండి. మీ ముఖం కొన్ని గంటల పాటూ జిడ్డు కారకుండా తాాజాగా ఉంటుంది. జిడ్డు చర్మం సమస్య ఉన్నవారికే ఈ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది.

సాధారణ సమయంలో కూడా టమోటాలను గుజ్జులా చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. టమోటా రసాన్ని తరచూ ముఖానికి రాయడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. చర్మానికి మృదుత్వం వస్తుంది. అలాగే ముఖంపై ఉండే నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి. తక్కువ ఖర్చుతోనే చర్మాన్ని కాంతివంతం చేయాలంటే టమోటాలను అధికంగా ఉపయోగించండి.