Homemade Facepack: ముఖాన్ని మెరిపించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ ఇంటి దగ్గరే వేసుకోండి చాలు, దీనికయ్యే ఖర్చు చాలా తక్కువే
Homemade Facepack: అందంగా కనిపించాలని ఎంతో మంది బ్యూటీ పార్లర్లకు వెళతారు. అక్కడ వేలుకువేలు ఖర్చుపెడతారు. దాని బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో అయ్యే ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది.
పండుగలు వరుసపెట్టి వచ్చేస్తున్నాయి. ప్రతి నెలా ఏదో ఒక పండుగ ఇకపై ఉంటుంది. పండుగలకు అందంగా మెరిసిపోవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అందుకోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని ఉత్పత్తులతో చాలా తక్కువ ఖర్చుతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ మీ అందాన్ని పెంచుతుంది. ఈఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఫేస్ ప్యాక్ తయారీ ఇలా
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, మీకు ఒక టీస్పూన్ బియ్యం పిండి, 1/2 టీస్పూన్ కలబంద జెల్, 1/2 టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల పెరుగు, అరస్పూను రోజ్ వాటర్ అవసరం. ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా వాడండి. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. అలాగే మెరుపును తెచ్చుకుంటుంది.
చర్మాన్ని శుభ్రపరచడానికి కలబంద జెల్ ఉత్తమమైనది. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మాన్ని తేమగా ఉంచడానికి ఇది ఉత్తమమైనది. అదే సమయంలో పెరుగు నేచురల్ క్లెన్సర్ లా కూడా పనిచేస్తుంది. ఈ ప్యాక్ ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.
మొటిమలు, మచ్చుల వంటివి రాకుండా ఉండాలంటే ఇంట్లోనే మరో ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి. ఒక చిన్న టమాటో బాగా మెత్తగా చేసి ఒక గిన్నెలో వేయాలి. అందులో శెనగపిండిని కూడా వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఉంచుకోవాలి. తరువాత సాధారణ నీళ్లతో శుభ్రపరుచుకోవాలి.
రెండు స్పూన్ల శెనగపిండిని ఒక స్పూన్ తేనె వేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. ఇది పావుగంట సేపు వదిలేసి తరువాత శుభ్రంగా వాష్ చేసుకోండి.
ఇంట్లో ఉన్న కాఫీ పొడితో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కాఫీ పొడిలో ఒక స్పూను తేనెను వేసి ముఖానికి పట్టించాలి. మీ కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతం తరువాత మిగతా చోట్ల రాసుకోవాలి. పావుగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇవన్నీ కూడా ముఖంపై ఉన్న చర్మాన్ని మెరిపిస్తాయి.
టాపిక్