Rose Water Benefits । రోజ్ వాటర్‌తో మీ ముఖం క్లీన్.. మీ లుక్ ఎవర్‌గ్రీన్!
Rose Water Benefits: రోజ్ వాటర్ ఉపయోగించడం ద్వారా చర్మానికి ఎలాంటి మేలు జరుగుతుంది, దీనిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
చర్మ సంరక్షణలో రోజ్ వాటర్ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రోజ్ వాటర్ మీ అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా సౌందర్య ఉత్పత్తులలో కూడా రోజ్ వాటర్‌ను వినియోగిస్తారు. ఎందుకంటే ఈ రోజ్ వాటర్ ఎంతో తేలికైనది, ఇంకా యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని వివిధ సమస్యల నుండి రక్షిస్తుంది.
రోజ్ వాటర్ చర్మంలోని నూనెలను సమతుల్యం చేస్తుంది. చర్మాన్ని సహజంగా హైడ్రేట్ చేస్తుంది. ఇంకా ముఖంపై ఏర్పడిన చిన్న గాయాలు, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది, సున్నితమైన రూపాన్ని అందిస్తుంది.
Rose Water Uses and Benefits for Skin
రోజ్ వాటర్ తో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
కళ్ల చుట్టూ నల్లటి వలయాలను తగ్గిస్తుంది
ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరగటం వల్ల ఈ రోజుల్లో చాలా మందికి కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి. రోజ్ వాటర్ ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఒక కప్పులో రెండు చెంచాల రోజ్ వాటర్ తీసుకోండి. అందులో దూదిని ముంచి కళ్ల కింద మెత్తగా అప్లై చేయాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల కళ్ల మంట కూడా తగ్గుతుంది.
UV కిరణాల నుండి రక్షిస్తుంది
రోజ్ వాటర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, సూర్యుడి నుండి వచ్చే హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఎండలోకి వెళ్లే ముందు రోజ్ వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే మంచిది. రోజ్ వాటర్ ను రోజూ ముఖానికి స్ప్రే చేయడం ద్వారా చర్మం క్లీన్ గా మారి చెమట గ్రంథులు కూడా తెరుచుకుంటాయి. ఇది మీకు తాజా అనుభూతిని ఇస్తుంది.
చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది
రోజ్ వాటర్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. రోజ్ వాటర్ మన ముఖంలో పేరుకుపోయిన నూనె జిడ్డు, మురికిని తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది సహజ నూనెలను సమతుల్యం చేసి చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతుంది. ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుంటే చర్మం మెరుస్తుంది.
ముడతలు తగ్గుతాయి
రోజ్ వాటర్‌లో కాటన్ ముంచి రోజులో ఒక్కసారైనా ముఖం తుడుచుకోవడం మంచిది. ఇది అద్భుతమైన స్కిన్ టానిక్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాల వల్ల ముడతలు తగ్గుతాయి. మీ చర్మాన్ని సమానంగా టోన్ చేస్తుంది. 1/2 చెంచా తేనెలో 2 చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి చర్మానికి రాసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ముఖంలో మార్పు కనిపిస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల మచ్చలు కూడా తగ్గుతాయి.
మీరు రోజ్ వాటర్ కొనుగోలు చేయాలనుకుంటే మంచి బ్రాండ్ రోజ్ వాటర్ కొనండి, మీరు ఇంట్లో కూడా రోజ్ వాటర్ ను తయారు చేసుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్