కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నాయా? అయితే ఈ హోం రెమెడీస్‌తో ఈజీగా తొలగించుకోండి!-easy skincare tips to combat dark circles and puffiness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   Easy Skincare Tips To Combat Dark Circles And Puffiness

కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నాయా? అయితే ఈ హోం రెమెడీస్‌తో ఈజీగా తొలగించుకోండి!

HT Telugu Desk HT Telugu
Jun 06, 2022 08:24 PM IST

అందమైన కళ్లు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు కళ్ల అందాన్ని తగ్గిస్తాయి. నల్లటి వలయాలు పెరుగుతున్న కొద్ది ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి

dark-circles/
dark-circles/

 నల్లటి వలయాలను తొలగించడానికి మార్కెట్లో అనేక ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ వీటి కారణంగా దుష్ప్రభావాలు కలుగుతాయి. నిద్రలేమి, ఒత్తిడి, ఎక్కువసేపు స్క్రీన్ దగ్గర ఉండటం, హార్మోన్లలో మార్పులు, అదుపు తప్పిన జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల కళ్లలో నల్లటి వలయాలు ఏర్పడతాయి. మీరు కూడా కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు.

ఐస్ తో మసాజ్: కళ్ల కింద నల్లటి వలయాలు పెరిగితే ఐస్ తో మసాజ్ చేయాలి. కళ్ల కింద ఐస్‌తో మసాజ్ చేయడం వల్ల కళ్ల వాపు తగ్గుతుంది. నల్లటి వలయాలు తగ్గుతాయి. ఐస్‌తో కళ్లను మసాజ్ చేయడానికి, ఒక టవల్‌లో ఐస్ ముక్కను తీసుకొని డార్క్ సర్కిల్‌పై మసాజ్ చేయండి.

బంగాళాదుంప రసంతో మర్దన: నల్లటి వలయాలను తొలగించడానికి, బంగాళాదుంప రసాన్ని ఉపయోగించవచ్చు. ఒక చిన్న బంగాళాదుంప తురుమును తీసుకుని చేతులతో పిండి దాని రసాన్ని తీయండి. ఈ రసంలో అర టీస్పూన్ శెనగపిండిని వేసి, పేస్ట్‌ను బాగా కలపాలి. తయారు చేసిన పేస్ట్‌ను డార్క్ సర్కిల్‌పై అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచండి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 2-3 రోజులు ఈ రెమెడీస్‌ని అనుసరిస్తే మీరే తేడాను గమనిస్తారు.

టీ బ్యాగ్స్‌తో డార్క్ సర్కిల్స్‌ మాయం: నల్లటి వలయాలను తొలగించడానికి, రెండు టీ బ్యాగ్‌లను తీసుకుని గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. కాసేపు నీటిలో నానబెట్టిన తర్వాత, టీ బ్యాగ్‌ను 15-20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. ఇప్పుడు ఈ టీ బ్యాగ్‌లను డార్క్ సర్కిల్‌లో 15 నిమిషాల పాటు ఉంచండి. టీ బ్యాగ్‌లు కళ్లను చల్లబరుస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

దోసకాయను అప్లై చేయండి : దోసకాయను కళ్లపై ఉపయోగించడం వల్ల కళ్లకు చల్లదనం వస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల కళ్లపై నల్లటి వలయాలు తొలగిపోతాయి. మీరు కూడా డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతుంటే, దోసకాయ ముక్కలను డార్క్ సర్కిల్స్‌పై 20 నిమిషాలు అప్లై చేసి, తర్వాత చల్లని నీటితో కళ్లను కడగాలి.

WhatsApp channel

సంబంధిత కథనం