Oils for Knee and Joint Pain: ఈ 5 నూనెలతో మర్దనా చేస్తే.. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి..-know five types of oils for knee and joint pain relief ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oils For Knee And Joint Pain: ఈ 5 నూనెలతో మర్దనా చేస్తే.. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి..

Oils for Knee and Joint Pain: ఈ 5 నూనెలతో మర్దనా చేస్తే.. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి..

Oils for Knee and Joint Pain: కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా? అయితే ఈ నూనెలతో మర్దనా చేయడం వల్ల ఉపశమనం ఉండొచ్చు. అవేంటో తెలుసుకోండి..

నొప్పులు తగ్గించే నూనెలు (pexels)

మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. రోజు వారీ జీవితంలో పనులను చేసుకోనీయకుండా ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు అంతకంతకూ మరీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటి వారు కొన్ని నూనెల్ని నొప్పి నివారిణులుగా ఉపయోగించుకోవచ్చు. అవి ఇంట్లో, బజారులో తేలికగా దొరికేవే అయినా చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

నొప్పులు తగ్గించే నూనెలు:

1. లావెండర్‌ నూనె:

సువాసన గల ఎసెన్షియల్‌ ఆయిల్‌గా లావెండర్‌ నూనెకు పేరుంది. ఇది వాపులను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. దీని వల్ల ఆర్థరైటిస్‌, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

2. నల్ల జీలకర్ర నూనె:

నల్ల జీలకర్ర నూనెను కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు గొప్ప ఔషధంగా చెబుతారు. దీనిలో ఉండే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు వాపుల్ని తగ్గిస్తాయి. దీనివల్ల నొప్పులు తగ్గుతాయి. ఇది కీళ్ల నొప్పులకే కాకుండా తలనొప్పి, నడుము నొప్పి.. లాంటి వాటికీ ఉపయోగపడుతుంది. ఇన్‌ఫెక్షన్లను దరి చేరనీయకుండా చూస్తుంది. నొప్పులు ఉన్న వారు సంబంధిత ప్రాంతంలో రోజుకు మూడు సార్లైనా దీన్ని రాసుకుని అలా వదిలేస్తే ఫలితం కనిపిస్తుంది.

3. అల్లం నూనె:

ఆర్థరైటిస్‌ నొప్పులపై జింజర్‌ ఆయిల్‌ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు తగ్గి తద్వారా నొప్పులూ తగ్గుతాయి. 2016లో జరిగిన ఓ అధ్యయనంలో ఆర్థరైటిస్‌, దీర్ఘకాలిక కీళ్ల వాపులపై ఇది అత్యంత ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. నొప్పి ఉన్న ప్రాంతంలో నాలుగు చుక్కల అల్లం నూనెను తీసుకుని సున్నితంగా రాసుకుంటే సరిపోతుంది.

4. యూకలిప్టస్ నూనె:

యూకలిప్టస్‌ చెట్టు నుంచి తీసే ఈ యూకలిప్టస్‌ నూనెకు నొప్పి నివారణ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కీళ్లు, మోకాళ్లు, కండరాల నొప్పులు, బెణుకులు, నరాల నొప్పులు.. తదితరాలపై ప్రభావవంతంగా పని చేస్తుంది. నాలుగైదు చుక్కల నూనెను తీసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్‌ చేసుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.

5. లెమన్‌ గ్రాస్‌ ఆయిల్:

రుమటోయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్న కొంత మందికి వరుసగా 30 రోజుల పాటు లెమన్‌ గ్రాస్‌ నూనెను రాసుకోమని పరిశోధకులు తెలిపారు. ఆ తర్వాత వారిలో నొప్పులు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. దీనిలో ఉన్న వాపుల్ని తగ్గించే లక్షణాల వల్ల నొప్పుల్ని తగ్గించడానికి ఇది సహకరిస్తోంది.