benefits of crying: కన్నీళ్లలో ఈ కన్నీళ్లు వేరట.. ఏడుపు వల్ల లాభాలు బోలెడట..
benefits of crying: కంటిచూపు మెరుగుపరచడం నుంచి ఒత్తిడి తగ్గించడం వలకు ఏడుపు వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.
భావోద్వేగాలను వ్యక్తపరిచే ప్రక్రియల్లో ఏడుపు ఒకటి. బాధ వచ్చినపుడు, పట్టలేనంత సంతోషం వచ్చినపుడు, కోపం వల్ల కళ్లల్లో నీల్లు వస్తాయి. భావోద్వేగాలను మన శరీరం ఇచ్చే రియాక్షన్ అది. దీనివల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి కూడా. కన్నీళ్లలో రకాలు కూడా ఉన్నాయి. అవి కంటి ఆరోగ్యానికి చేసే మేలు చాలానే. ఆ రకాలేంటో.. లాభాలేంటో తెలుసుకోండి.
కన్నీళ్ల రకాలు:
బేసల్ టియర్స్:
ఇవి మన కళ్లల్లో ఎప్పుడూ ఉండే నీళ్లు. ఇవి దుమ్ము నుంచి మన కళ్లను కాపాడతాయి. వీటిలో లైసోజైమ్ ఉంటుంది. ఈ కన్నీళ్లలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కంటిని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి.
రిఫ్లెక్స్ టియర్స్:
కళ్లలో దుమ్ము పడ్డప్పుడు, ఉల్లిపాయలు తరుగుతున్నపుడు, కళ్లకు ఇబ్బందిగా ఉన్నపుడు వాటికి రియాక్షన్ లాగా కళ్లలో నుంచి నీళ్లొస్తాయి. వాటిని రిఫ్లెక్స్ టియర్స్ అంటారు.
ఎమోషనల్ టియర్స్:
మనం బాధతో ఏడ్చినపుడు వచ్చే కన్నీళ్లివి. వీటిల్లో ఒత్తిడి తగ్గించే హార్మోన్లుంటాయి. ఇవి శరీరంలో కార్టిసోల్ హార్మోన్లను నియంత్రిస్తాయి. వాటివల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
కంటి ఆరోగ్యం మీద కన్నీళ్ల ప్రభావం:
నొప్పి:
ఏడ్చినపుడు ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ విడుదలై సహజంగానే బాధ, ఒత్తిడి తగ్గిస్తాయి.
శుభ్రం చేయడం:
కళ్లు తేమగా, శుభ్రంగా ఉండటానికి కన్నీళ్లే కారణం.
దృష్టి:
కళ్లలో తగినంత తేమ లేకపోతే దృష్టిలో స్పష్టత లోపిస్తుంది. కను రెప్పలు వాల్చిన ప్రతిసారి మన కంట్లో బేసల్ టియర్స్ వస్తాయి. ఇవే కళ్లను తేమగా ఉంచి దృష్టిలోపం రాకుండా చేస్తాయి.
ఒత్తిడి:
శరీరంలో ఉన్న బాధ, ఒత్తిడిని ఏడుపు తగ్గిస్తుంది. ఏడ్చాక కాస్త బాధ తగ్గినట్లు అనిపించడానికి కారణం అదే.
నరాల ఆరోగ్యం:
కన్నీళ్లు నరాల పెరుగుదల కారకాలు. ఇవి న్యూరాన్ల పెరుగుదల మరియు మనుగడకు తోడ్పడతాయి.
సాంత్వన:
ఏడుపు ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా సాంత్వన ఇస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది.