ఉల్లిపాయలు కొసేటప్పుడు కన్నీళ్లు రావద్దంటే ఈ టిప్స్ పాటించండి!-how to cut onions without crying tried this methods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Cut Onions Without Crying Tried This Methods

ఉల్లిపాయలు కొసేటప్పుడు కన్నీళ్లు రావద్దంటే ఈ టిప్స్ పాటించండి!

HT Telugu Desk HT Telugu
May 15, 2022 12:02 AM IST

ప్రతి కూరలో ఉల్లిపాయ తప్పనిసరిగా వేసుకోవడం భారతీయులకు అలవాటుగా ఉంటుంది. కానీ దాన్ని తరిగేటప్పుడు మాత్రం చుక్కులు చూపిస్తోంది. కంటిలో నుండి నీళ్లు ధారలు అలా కారుతునే ఉంటాయి.

cutting
cutting

సాధారణంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు రావడం మామూలే. కన్నీళ్లకు ప్రధాన కారణం ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే సిన్-ప్రొపాంథైల్-ఎస్-ఆక్సైడ్ రసాయనం. ఈ రసాయనం కళ్లలో ఉండే లాక్రిమల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా కళ్లలో నుండి నీళ్లు కారుతాయి. అయితే ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకూడదనుకుంటే ఈ చిట్కాలు పాటించండి. 

 

ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు పదునైన కత్తిని ఉపయోగించాలి. దీంతో తొందరగా ఉల్లిపాయలను కట్ చేయవచ్చు.

 

ఉల్లిపాయను కొసే ముందు దాని ఎగువ భాగాన్ని కట్ చేసి 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలో ఉండే సల్ఫ్యూరిక్ నీటిలో చేరుతుంది.

ఉల్లిపాయను కట్ చేసే కత్తిపై కొద్దిగా నిమ్మరసం వేయాలి. ఇలా చేయడం వల్ల మీ కళ్ల నుండి నీళ్లు రావు

ఉల్లిపాయను కోసే ముందు పేపర్ టవల్‌ను నీటిలో తడిపి ఉల్లిపాయలపై చుట్టాలి. ఆ తర్వాత నీటిలో దానిని నానబెట్టాలి. కొద్దిసేపటి తర్వాత ఉల్లిపాయలను తీసి కట్ చేయోచ్చు.

ఉల్లిపాయలు కోసే సమయంలో కొవ్వొత్తి లేదా దీపం వెలిగించండి. దీంతో ఉల్లిపాయ నుంచి విడుదలయ్యే గ్యాస్ దీపం వైపు వెళ్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం