Karthika Masam Rituals: కార్తీక మాసంలో చేయకూడని పనులేంటి?-karthika masam your complete guide to rituals and restrictions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Karthika Masam Rituals: కార్తీక మాసంలో చేయకూడని పనులేంటి?

Karthika Masam Rituals: కార్తీక మాసంలో చేయకూడని పనులేంటి?

Himabindu Ponnaganti HT Telugu
Sep 23, 2024 04:34 PM IST

Karthika Masam Rituals: కార్తీక మాసంలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అలాగే ఎలాంటి విధి విధానాలు ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకోండి.

<p>కార్తీక దీపం&nbsp;</p>
కార్తీక దీపం ((Photo Credit/Pixabay))

హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ నెల మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తుంటారు. శివాలయాలు ఓం కారంతో మారుమోగుతాయి. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల తెలిసి చేసినా, తెలియక చేసిన పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. అందువల్ల ఈ పవిత్ర మాసంలో మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుంటే మరింత మంచిది. 

చేయకూడని పనులు

కార్తీక మాసం అంతా భక్తులు ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తారు. ఈ మాసంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. 

-  మాంసాహారం తీసుకోకూడదు. మద్యం సేవించరాదు.

- కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మౌనంగా భోజనం తీసుకోవాలి.

- గుమ్మడి కాయ,  ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, వంటి ఆహార పదార్థాలను తినకూడదు. 

- పెసర పప్పు, శనగపప్పు, నువ్వులు కూడా తీసుకోరాదు. ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం రోజు కొబ్బరి, ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెబుతారు.

కార్తీక మాసంలో ఇలా చేస్తే.. 

- సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కుదిరితే నదీ స్నానం ఆచరించాలి. ఈ మాసంలో తులసి పూజ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే తులసి చెట్టుకు  ప్రత్యేక పూజలు చేయాలి.

- రోజూ ఉదయం కార్తీక దీపాలను వెలిగిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ నెల మొత్తం కుదిరితే ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల నిత్యం సంతోషంగా ఉంటారు.

- సోమవారం శివాలయం వెళ్లి శివుడికి బిల్వ పత్రాలు సమర్పించి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల స్వామి వారి అనుగ్రహం దక్కుతుందని నమ్మకం.

- వీలైనన్ని శివాలయాలు దర్శించుకుని శివయ్య కృపకు పాత్రులు కావొచ్చు. 

Whats_app_banner

సంబంధిత కథనం