Kanuma Wishes Telugu : మీ ప్రియమైన వారికి ఇలా కనుమ శుభాకాంక్షలు చెప్పండి
Kanuma Greetings In Telugu : సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ. ఈ పండగ శుభాకాంక్షలు మీ ప్రియమైన వారికి తెలియజేయండి. మీ కోసం ఇక్కడ కొన్ని కోట్స్ ఉన్నాయి.
సంక్రాంతి పండుగలో కనుమ కూడా చాలా ముఖ్యమైనది. పాడి పశువులను పూజించే పండుగ ఇది. ఈరోజున రైతన్నలు తమ పశువులకు స్నానాలు చేయించి.. కొమ్ములకు నూనె రాసి పూజలు చేస్తారు. వ్యవసాయంలో తమకు తోడుకు ఉన్నందుకు వాటికి కృతజ్ఞతలు తెలుపుకొంటారు. ఈ కనుమ పండుగ శుభాకాంక్షలును మీ ప్రియమైన వారికి చెప్పండి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు
కనుమ పండుగ మీ జీవితంలో మరుపరాని ఆనందాలను తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ కనుమ
కనుమ పండుగ మీకు అదృష్టం తేవాలని కోరుకుంటూ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
ఈ కనుమ నుంచి సకల ఐశ్వర్యాలు మీకు రావాలని ఆశిస్తూ Happy Kanuma
కనుమ పండుగ మీ జీవితంలో మరపురాని ఆనందాలను కలగజేయాలని కోరుకుంటూ కనుమ రోజు శుభాకాంక్షలు
ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
కనుమ మీ జీవితంలో కొత్త ఆశలు నింపాలని, కొత్త జీవితం ప్రసాదించాలని ఆశిస్తూ Happy Kanuma 2024
సంక్రాంతి అంటే ఓ కొత్త కాంతి తేవాలని, కనుమ నూతన ఆరంభానికి శ్రీకారం కావాలని కోరుకుంటూ.. హ్యాపీ కనుమ
ఈ కనుమ పర్వదినాన్ని మీ కుటుంబ సభ్యులంతా కలిసి గొప్పగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి వేడుకలు ఏడాదికి సరిపోయే మంచి జ్ఞాపకాలను ఇవ్వాలని ఆకాంక్షిస్తూ.. కనుమ శుభాకాంక్షలు
కమ్మని విందుల కనుమ, కలకాలం మీ బంధాలను నిలిపి ఉంచాలి.. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.. హ్యాపీ కనుమ
కనుమలోని కమనీయం మీ జీవితాన్ని రమణీయంగా మార్చాలని మనసారా కోరుకుంటూ Happy Kanuma 2024
మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడి పంటలతో పచ్చగా.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ.. కనుమ శుభాకాంక్షలు
కనుమ పండుగ మీ కష్టాలన్నింటినీ తొలగించి.., సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ అందరికీ కనుమ శుభాకాంక్షలు..
అందమైన రంగవల్లుల్లా ఆనందంగా ఉంటూ.. ఎదురైన సమస్యల మీద పందెంకోడిలా పోరాడుతూ.. ఆకాశంలో గాలిపటంలా అందనంత ఎత్తుకు ఎదిగి.. చెరుకుగడలాంటి తియ్యని జీవితాన్ని పొందాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
రైతులే రాజుగా రాతలే మార్చే పండగ.. పంట చేలు కోతలతో ఇచ్చే కానుక.. కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ.. ప్రతి ఇంట్లో జరగాలి ఈ వేడుక.. హ్యాపీ కనుమ 2024
మట్టిలో పుట్టిన మేలిమి బంగారం.. కష్టం చేతికి వచ్చే తరుణం.. నేలతల్లి, పాడిపశువులు అందించిన వరప్రసాదం.. కనుమలా వడ్డించింది పరమాన్నం.. కనుమ పండుగ శుభాకాంక్షలు..
కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ.. శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ.. కనుమ పండుగ శుభాకాంక్షలు
వ్యవసాయంలో సాయం చేసే పశువులు.. వాటికి రుణపడి ఉండాలి జన్మజన్మలు.. అవి లేకుంటే లేవు బతుకులు.. Happy Kanuma