Mixed Fruit Lassi । మిక్స్‌డ్ ఫ్రూట్ లస్సీ.. ఇలా చేస్తే మైమరిపించే రుచి!-indulge yourselves in the taste of mixed fruit lassi here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mixed Fruit Lassi । మిక్స్‌డ్ ఫ్రూట్ లస్సీ.. ఇలా చేస్తే మైమరిపించే రుచి!

Mixed Fruit Lassi । మిక్స్‌డ్ ఫ్రూట్ లస్సీ.. ఇలా చేస్తే మైమరిపించే రుచి!

HT Telugu Desk HT Telugu
Jun 16, 2023 06:35 PM IST

Mixed Fruit Lassi Recipe: మిక్స్‌డ్ ఫ్రూట్ లస్సీ మీకు ఒక సంపూర్ణమైన వేసవి పానీయం. ఎంపిక చేసిన పండ్ల రకాలతో ఫ్రూట్ లస్సీ ఎలా చేయాలో ఈ కింద రెసిపీని చదవండి

Mixed Fruit Lassi Recipe
Mixed Fruit Lassi Recipe (istock)

Summer Refreshing Drinks: నిప్పులు కక్కే వేడి రోజులలో ఒక గ్లాసు చల్లని లస్సీ తాగితే వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఒక్కసారిగా మిమ్మల్ని చల్లబరిచి, తాజాదనపు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. దాని రుచి మిమ్మల్ని స్వర్గంలో తేలుస్తుంది. అంతేకాదు ఇది ఒక ప్రొబయోటిక్ పానీయం కాబట్టి మీ కడుపును చల్లబరుస్తుంది, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. లస్సీని మీరు వివిధ రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో తాజా పండ్లను కలిపితే మరింత ఆరోగ్యంగా, పోషకభరితంగా మారుతుంది. మీ కడుపును నింపే ఒక సంతృప్తికరమైన అల్పాహారంగా మారుతుంది.

మిక్స్‌డ్ ఫ్రూట్ లస్సీ మీకు ఒక సంపూర్ణమైన వేసవి పానీయం. ఎంపిక చేసిన పండ్ల రకాలతో ఫ్రూట్ లస్సీ ఎలా చేయాలో ఈ కింద రెసిపీని చదవండి.

Mixed Fruit Lassi Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు పెరుగు
  • 1 కప్పు పండ్లు (మామిడి, పైనాపిల్, అరటి)
  • 1 టేబుల్ స్పూన్ తేనె
  • 1 చిటికెడు దాల్చినచెక్క పొడి
  • 1 పుదీనా ఆకుల రెమ్మ

మిక్స్‌డ్ ఫ్రూట్ లస్సీ తయారీ విధానం

  1. ముందుగా మామిడి, పైనాపిల్, అరటిపండ్లను తీసుకొని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
  2. ఇప్పుడు బ్లెండర్‌లో కట్ చేసుకున్న పండ్ల ముక్కలు, పెరుగు వేయండి. ఆపై దాల్చిన చెక్క పొడి, తేనె కూడా కలపండి
  3. మీడియం స్పీడ్‌లో స్మూత్‌గా, క్రీమీ అయ్యే వరకు మిశ్రమాన్ని బ్లెండ్ చేయండి.
  4. సిద్ధం అయిన ఫ్రూట్ లస్సీని సర్వింగ్ గ్లాసుల్లో పోయాలి.
  5. చివరగా పైన ఐస్ క్యూబ్స్ వేసి, పుదీనా ఆకుల రెమ్మతో అలంకరించండి.

అంతే, మిక్స్‌డ్ ఫ్రూట్ లస్సీ రెడీ. మనసారా తాగుతూ మధురమైన రుచిని ఆస్వాదించండి.

సంబంధిత కథనం