Indian Constitution: అంబేద్కర్ నేడు లేకపోయినా... భారత రాజ్యాంగ రూపంలో బతికే ఉన్నారు-indian constitution even though ambedkar is no more today he lives on in the form of the indian constitution ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indian Constitution: అంబేద్కర్ నేడు లేకపోయినా... భారత రాజ్యాంగ రూపంలో బతికే ఉన్నారు

Indian Constitution: అంబేద్కర్ నేడు లేకపోయినా... భారత రాజ్యాంగ రూపంలో బతికే ఉన్నారు

Haritha Chappa HT Telugu
Jan 26, 2024 09:00 AM IST

Indian Constitution: భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి దేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చారు. రాజ్యాంగం గురించి, మన దేశం గురించి ఆయన ఎన్నోసార్లు మాట్లాడారు. ఆయన చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఓసారి స్పురించుకుందాం.

రాజ్యాంగంపై సంతకాలు పెడుతున్న ప్రముఖులు
రాజ్యాంగంపై సంతకాలు పెడుతున్న ప్రముఖులు

Indian Constitution: అంబేద్కర్ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది రాజ్యాంగమే. భారతదేశంలో రాజ్యాంగం నిలిచి ఉన్నంతకాలం... ఇక్కడి ప్రజల గుండెల్లో అంబేద్కర్ పేరు గుర్తుంటుంది. ఈయన అంటరానితనంపై తీవ్ర పోరాటమే చేశారు. కులం పేరుతో దూషించడాన్ని అడ్డుకున్న మొదటి వ్యక్తి ఈయనే. అభివృద్ధి అంటే అద్దాలమేడలు కాదని... పౌరులు ఎదగడమే నిజమైన దేశాభివృద్ధి అని చెప్పారు. బానిసత్వాన్ని ఎవరికి వారే పోగొట్టుకోవాలని... ఇతరుల మీద ఆధార పడవద్దని.. అప్పటి బలహీనుల్లో ధైర్యాన్ని నింపారు. ఈయన మన దేశమే కాదు, ప్రపంచం పైన ఎంతో ప్రభావం చూపిన గొప్ప వ్యక్తి. అంటరానితనం రాజ్యమేలుతున్న కాలంలోనే ఎన్నో అవమానాలను తట్టుకొని ఉన్నత చదువులను అభ్యసించారు.

ప్రపంచానికి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఇచ్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. రాజ్యాంగం గురించి తన దేశం గురించి ఎన్నోసార్లు ఆయన ప్రస్తావించారు. అందులోని కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి. వాటిని ఒకసారి తలుచుకుందాం.

1. నా శరీరం చచ్చిపోయినా

భారత రాజ్యాంగ రూపంలో నేను బతికే ఉంటాను.

రాజ్యాంగాన్ని చంపినప్పుడే

నేను శాశ్వతంగా కన్నుమూస్తాను.

2. ఆశయాలను ఆచరణలో పెడితేనే

మానవుడు మహనీయుడు అవుతాడు

3. గొప్ప వ్యక్తికి, ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంది.

గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకే ప్రాముఖ్యత ఇస్తాడు.

ప్రముఖ వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు.

4. సకాలంలో సరైన చర్య తీసుకుంటేనే

దాని ఫలితం పది కాలాలపాటు నిలుస్తుంది.

5. క్రూరత్వం కంటే నీచత్వమే అత్యంత హీనమైనది.

ఎవరిని నీచంగా చూడకండి.

6. ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే

నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం.

7. ఎవరో వేసిన సంకెళ్లను వారినే వచ్చి తీసేయమని ప్రాధేయపడే కన్నా

మనమే శక్తి, సామర్థ్యాలను పెంచుకొని

వాటిని చేదించడం మంచిది.

8. రాజ్యాంగం దుర్వినియోగం అయిందని,

నేను కనుగొంటే దానిని కాల్చే మొదటి వ్యక్తిని నేనే.

9. కేవలం పుస్తకాలను చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది?

చెదపురుగులు కూడా పుస్తకాలు నమిలేస్తాయి.

అంతమాత్రాన వాటికి జ్ఞానం వస్తుందా?

10. దేశానికి గాని, జాతికి గాని సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు.

ప్రజలు విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.

11. పునాదుల మీద దేనిని సాధించలేం

ఒక జాతి నీతిని నిర్మించలేం.

12. నేను, నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యం.

13. మేకల్ని బలి ఇస్తారు, సింహాలను కాదు

మీరంతా సింహాల్లా బతకండి.

Whats_app_banner