Winter Exercises | బరువు తగ్గాలనుకునేవారు శీతాకాలం వ్యాయామం చేయండి.. ఎందుకంటే?!-if you want to burn more calories winter is the season to working out check out some best ways here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Exercises | బరువు తగ్గాలనుకునేవారు శీతాకాలం వ్యాయామం చేయండి.. ఎందుకంటే?!

Winter Exercises | బరువు తగ్గాలనుకునేవారు శీతాకాలం వ్యాయామం చేయండి.. ఎందుకంటే?!

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 08:15 AM IST

Winter Exercises: శీతాకాలంలో వ్యాయామం కూడా వెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సీజన్ లో మీ ఫిట్ నెస్ నిర్వహణకు చేయదగిన మంచి వ్యాయామాలను నిపుణులు సూచించారు. అవేంటో చూడండి.

Winter Exercises
Winter Exercises (Unsplash)

వేకువఝామునే లేవడం చాలా కష్టంగా అనిపించే సీజన్ ఏదైనా ఉందంటే అది శీతాకాలమే. ఉదయం ఎనిమిది, తొమ్మిది అయినా కూడా ఇంకా తెలవారలేదేమో అన్నట్లుగా బయట వాతావరణం ఉంటుంది. ఆపై చల్లటి చలి మినల్ని నిండా ముసుగేసుకొని ఇంకా వెచ్చగా పడుకోవాలన్నట్లు ప్రేరేపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లి వ్యాయామం చేయడమంటే అది దాదాపు అసాధ్యమే. అందుకే ఈ సీజన్‌లో చాలా మంది బరువు పెరగడానికి ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి.

కానీ, ఈ చలికాలంలో పొద్దున్నే లేవడానికి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని, వ్యాయామం చేయాలని సంకల్పిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయట. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి శీతాకాలం ఉత్తమ సీజన్ అని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో వ్యాయామం చేయడం వల్ల వేసవిలో కంటే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని చెబుతారు. ఎందుకంటే చలికాలంలో వ్యాయామం చేసే కొద్దీ వెచ్చగా అనిపిస్తుంది, చెమట పట్టడం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల వ్యాయామం మరింత సమర్థవంతంగా జరుగుతుంది.

Winter Exercises- చలికాలంలో వ్యాయామాలు

చలికాలంలో మీరు వ్యాయామం చేయడానికి, మీ ఫిట్‌నెస్‌ను కొనసాగించడానికి చాలా రకాల వ్యాయామాలు చేయవచ్చు. పలు రకాల ప్రయోజనాల కోసం నిపుణులు సూచించిన కొన్ని మార్గాలను ఇక్కడ చూడండి.

బ్రిస్క్ వాకింగ్

చురుకైన నడకతో మీ వ్యాయామ దినచర్యను ప్రారంభించండి లేదా మీరు జాగింగ్ కూడా చేయవచ్చు. మీ కమ్యూనిటీ పరిసరాల్లోనే పరుగెత్తవచ్చు. ఇలా ఏం చేసినా ఇది మీ హృదయ స్పందన రేటును పెంచే ఒక కార్డియోవాస్కులర్ వ్యాయామంగా ఉంటుంది. ఈ నడక మీరు మరిన్ని వ్యాయామాలు చేయడానికి మిమ్మల్ని మానసికంగా , శారీరకంగా సిద్ధం చేస్తుంది.

స్ట్రెచింగ్

జాగింగ్ చేసిన తర్వాతైనా, లేదా ఏ వ్యాయామం తర్వాతనైనా స్ట్రెచింగ్ చేయడం మరిచిపోవద్దు. వ్యాయామం చేసే ముందు వార్మప్ చేయాలి, వ్యాయామం పూర్తైన తర్వాత కొన్ని నిమిషాల పాటు మీ శరీరాన్ని సాగదీయడం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. స్ట్రెచింగ్స్ మీ కండరాలను గాయాలు అవకుండా సురక్షితంగా ఉంచుతుంది, కండరాల ఆకృతిని మరింత టోన్ చేసేందుకు సహాయపడుతుంది.

సూర్య నమస్కారాలు

ఉదయం లేచి చేయగాలిగే ఎన్నో రకాల అద్భుతమైన యోగా ఆసనాలు, భంగిమలు ఉన్నాయి. అయితే సూర్య నమస్కారాలు ఇందులో ప్రత్యేకమైనవి. సూర్య నమస్కారాలను శరీరం మొత్తానికి వ్యాయామం అందించే అభ్యాసంగా పరిగణించబడుతుంది. ఉదయాన్నే వివిధ సూర్య నమస్కారాలను ప్రాక్టీస్ చేయడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి పెరుగుతుంది. ఇది అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రాణాయామం

ప్రాణాయామం అనేది శ్వాసతో చేసే వ్యాయామం. ఇది మీ శ్వాసను మెరుగుపారచడమే కాకుండా మీ మనస్సు, శరీరం రెండింటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శీతాకాలంలో కపాల్‌భతి ప్రాణాయామం, ఖండ ప్రాణాయామం గొప్ప అభ్యాసాలుగా ఉంటాయి. వీటితో పాటు ధ్యానం కూడా ఆచరించడం మంచిది. ఈ ధ్యానంలో కూడా స్థితి ధ్యానం, స్వాస్ ధ్యానం, ఆరంభ ధ్యానం వంటి అనేక ధ్యాన పద్ధతులు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం