Food In News paper : న్యూస్ పేపర్లో పెట్టిన ఆహారం తింటున్నారా?
Food Wrapped In News paper : మనం సాధారణంగా బయటకు వెళ్తాం. రోడ్డు పక్కన ఫుడ్ కనిపిస్తుంది. తినాలనిపిస్తుంది. అమ్మేవాళ్లు న్యూస్ పేపర్లో చుట్టి ఇస్తారు. అయితే ఇలా తినడం మంచిదేనా?
బయటకు వెళితే.. సమోసా, చాట్, బజ్జీలు, ఇలాంటి జంక్ ఫుడ్ కనిపిస్తే.. మనసు ఆగదు. తింటే కూడా టెస్టీగా ఉంటుంది. కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. ఇవి అనారోగ్యకరమైనవి అనే వాదన కూడా ఉంది. రోడ్డు మీద పెట్టి.. పరిశ్రుభత పాటించరు అని కొందరు అంటుంటారు. ఈ విషయం పక్కనపెడితే.. స్ట్రీట్ ఫుడ్(Street Food).. న్యూస్ పేపర్లో చుట్టి ఇస్తారు. పార్సిల్ అయినా, అక్కడే తిన్నా.. ఇలానే ఇస్తారు. దీనివలన ఏం జరుగుతుంది?
న్యూస్ పేపర్(News Paper) కోసం వాడే ప్రింటింగి ఇంక్ హానికరమైన కెమికల్స్(Chemicals) ఉంటాయి. రసాయన బైండర్లు, అనేక హానికరమైన భాగాలను కలిగి ఉంటుంది. ఇవి తీసుకుంటే.. ఆరోగ్యానికి హానికరం. స్ట్రీట్ ఫుడ్ అమ్మేవాళ్లు.. వీటిని పట్టించుకోరు. వార్తా పత్రికలో ఫుడ్ పెట్టి పార్సిల్ చేసేందుకు, తినేందుకు ఇస్తారు. రీసైకిల్ చేసిన పేపర్(Paper)తో తయారు చేయబడ్డ పేపర్/కార్డ్ బోర్డ్ బాక్సులు కూడా థాలేట్ వంటి హానికరమైన రసాయనాలతో కలుషితం అయి ఉండొచ్చు. ఇవి జీర్ణ సమస్యలను దారితీస్తాయి. అలా ప్యాక్ చేసిన ఆహారంతో క్యాన్సర్(Cancer) సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెప్పే మాట.
వార్తాపత్రికల్లో రసాయన సమ్మేళనాలు, రీసైకిల్ చేసిన కాగితంలో థాలేట్లు ఉండొచ్చు. ఆ రసాయనలతో రొమ్ము క్యాన్సర్లు, స్థూలకాయం వంటి ప్రమాదం ఉంది. వార్తాపత్రికకు వాడే సిరాలో సీసం, కాడ్మియం వంటి భారీ లోహాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. న్యూస్ పేపర్లలో వేడి ఆహారం(Food) చుడుతారు. ఎక్కువ ఆయిల్, డీప్ ఫ్రై చేసిన వాటిని న్యూస్ పేపర్లో పెట్టి ఇస్తారు. న్యూస్ పేపర్ ప్రింటింగ్ కు ఉపయోగించే.. ఇంకులో ఉండే కెమికల్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇమ్యునిటీ తక్కువగా ఉండే పిల్లలు, పెద్దవాళ్లపై దుష్ప్రభావం చూపుతుంది.