తెలుగు న్యూస్ / ఫోటో /
Breast Cancer Symptoms । ఈ 5 లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌కు ప్రారంభ సంకేతాలు, ఆలస్యం చేయవద్దు!
- Breast Cancer Symptoms: రొమ్ము క్యాన్సర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలను ప్రభావితం చేస్తున్న ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభంలోనే కనిపిస్తాయి. ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స పొందితే, ప్రమాదం నుంచి బయటపడవచ్చు.

(1 / 8)
రొమ్ము క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే వ్యాధి. రానున్న రోజుల్లో ఈ వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సంకేతాల ఆధారంగా ప్రారంభ దశలోనే ఈ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు. వెంటనే చికిత్స ప్రారంభించడం వలన ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు(Freepik)
(2 / 8)

(3 / 8)
రొమ్ములో అసాధారణ గడ్డలు లేదా వాపులను నిర్లక్ష్యం చేయవద్దు. రొమ్ములలో ఏవైనా వాపులు, గడ్డలు గమనిస్తే అవి క్యాన్సర్ కణతులు కావొచ్చు. కాబట్టి పరీక్ష చేయించుకోండి. (Freepik)
(4 / 8)
రొమ్ము ఆకృతిలో మార్పు ఉండవచ్చు. మీ రొమ్ములు అసాధారణంగా ఆకారంలోకి మారాయనుకుంటే తక్షణ వైద్య సహాయం అవసరమని అర్థం చేసుకోండి.(Freepik)
(5 / 8)
రొమ్ము క్యాన్సర్ప్రధాన లక్షణం విలోమ చనుమొన ( చనుమొన బయటకు కాకుండా లోపలికి తిరగడం). ఈ స్థితిలో, రొమ్ములోని థొరాసిక్ డక్ట్ రొమ్ములోకి కదులుతుంది. మీరు ఈ లక్షణాన్ని గమనించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.(Freepik)
(6 / 8)
రొమ్ము రంగులో మార్పు.. మీ రొమ్ములు ఎరుపు లేదా నారింజ రంగులోకి మారడం అనేది రొమ్ము క్యాన్సర్ లక్షణాలలో ఒకటి
(7 / 8)
చనుమొన చుట్టూ చర్మం నల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో చర్మం గట్టిగా లేదా వాపుగా ఉంటే శ్రద్ధ వహించండి. మీరు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఇతర గ్యాలరీలు