JB Chemicals dividend: భారీ డివిడెండ్ ప్రకటించిన జేబీ కెమికల్స్-jb chemicals declares 8 50 rupees per share dividend posts 32 percent revenue growth in q3
Telugu News  /  Business  /  Jb Chemicals Declares 8.50 Rupees Per Share Dividend, Posts 32 Percent Revenue Growth In Q3
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

JB Chemicals dividend: భారీ డివిడెండ్ ప్రకటించిన జేబీ కెమికల్స్

08 February 2023, 21:54 ISTHT Telugu Desk
08 February 2023, 21:54 IST

JB Chemicals dividend: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) ఫలితాలను జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యుటికల్స్ లిమిటెడ్ (J.B. Chemicals & Pharmaceuticals Ltd) బుధవారం విడుదల చేసింది.

JB Chemicals dividend: జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యుటికల్స్ (J.B. Chemicals & Pharmaceuticals Ltd) ఔషధ రంగంలో ఉన్న ఒక భారతీయ మిడ్ క్యాప్ కంపెనీ. దీని మార్కెట్ వాల్యూ రూ. 15,748.86 కోట్లు. భారత్ తో పాటు, ప్రధానంగా రష్యా, దక్షిణాఫ్రికాల్లో కూడా ఈ సంస్థ (J.B. Chemicals & Pharmaceuticals Ltd) కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఫార్మాస్యుటికల్ సంస్థకు చెందిన ఐదు బ్రాండ్స్ భారత్ లోని టాప్ 300 ఐపీఎం బ్రాండ్స్ (top 300 IPM brands) లో ఉన్నాయి. జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యుటికల్స్ తమ ప్రొడక్ట్స్ ను ప్రపంచవ్యాప్తంగా అమెరికా సహా సుమారు 40 దేశాల్లో విక్రయిస్తుంది. ఈ సంస్థ హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా చాలా పాపులర్.

JB Chemicals dividend: 425% డివిడెండ్

జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యుటికల్స్ (J.B. Chemicals & Pharmaceuticals Ltd) బుధవారం 2022 డిసెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. అలాగే, తమ మదుర్లకు ఆకర్షణీయమైన డివిడెండ్ ను కూడా ప్రకటించింది. రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ. 8.50 (425%) డివిడెండ్ గా అందించనున్నట్లు సంస్థ (J.B. Chemicals & Pharmaceuticals Ltd) వెల్లడించింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డు డేట్ గా ఫిబ్రవరి 18వ తేదీని ప్రకటించింది. అలాగే, మార్చి 1వ తేదీ లోపు డివిడెండ్ ఎమౌంట్ షేర్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని ప్రకటించింది.

JB Chemicals dividend: రూ. 793 కోట్ల ఆదాయం

2022 డిసెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3) రూ.793 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యుటికల్స్ (J.B. Chemicals & Pharmaceuticals Ltd) వెల్లడించింది. గత Q3 లో సంస్థ ఆదాయం రూ. 601 కోట్లు. అంటే, గత ఆర్థిక సంవత్సరం Q3 తో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం Q3 లో సంసథ 32% అధిక ఆదాయాన్ని సముపార్జించింది. అలాగే, నికర లాభాల విషయానికి వస్తే, ఈ Q3 లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యుటికల్స్ (J.B. Chemicals & Pharmaceuticals Ltd) రూ. 106 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత Q3 లో సంస్థ ఆర్జించిన నికర లాబాలు రూ 84 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో జేబీ కెమికల్స్ రూ. 2,387 కోట్ల ఆదాయం సమకూర్చుకోగలిగింది. గత ఆర్తిక సంవత్సరం తొలి 9 నెలల్లో సంస్థ (J.B. Chemicals & Pharmaceuticals Ltd) సంపాదించిన నికర ఆదాయం రూ. 1800 కోట్లు. అంటే, దాదాపు 33% వృద్ధిని సాధించింది. ఈ ఆర్తిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించడం సంతోషకరమని, తమ ఆర్గానిక్ పోర్ట్ పోలియో సాధించిన విజయాల కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైందని జేబీ ఫార్మా (J.B. Chemicals & Pharmaceuticals Ltd) సీఈఓ నిఖిల్ చోప్రా వ్యాఖ్యానించారు. JB Chemicals & Pharmaceuticals షేరు విలువ ఫిబ్రవరి 8న 1.06% పెరిగి, రూ. 2,036.00 వద్ద స్థిరపడింది.