Periods: మహిళల్లో నెలసరి సమయంలో ఇలాంటి సమస్యలు కనిపిస్తే చాలా డేంజర్, వాటికి చికిత్స అవసరం
Periods: మహిళల్లో నెలసరి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇవి ఎన్నో అంతర్లీన్ వైద్య సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి నెలసరి సమస్యలకు తేలికగా తీసుకోకూడదు. పీరియడ్స్ తప్పిపోవడం నుంచి అధిక రక్త స్రావం వరకు సమస్య ఏదైనా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
మహిళల్లో రుతుస్రావం ముఖ్యమైన జీవ ప్రక్రియ. ప్రతి నెలా నెలసరి కావడం అనేది ఆరోగ్యకరమైన రుతుచక్రాన్ని సూచిస్తుంది. ప్రతి మహిళకు రుతుచక్రం ప్రత్యేకంగా ఉంటుంది. మీ ఆరోగ్యం, శరీరాన్ని బట్టి, రక్తస్రావం రెండు రోజుల నుండి వారం రోజుల వరకు ఉండవచ్చు. కొందరికి తేలికపాటి రక్తస్రావం కావచ్చు, మరికొందరిలో అధిక రక్తస్రావం కలగవచ్చు. ఒక్కొ మహిళలు ఒక్కో రకంగా ఉంటాయి పీరియడ్స్ సమస్యలు.
కొందరిలో పీరియడ్స్ సమయంలో తీవ్ర నొప్పి వస్తుంది. మీకు పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తున్నంత కాలం వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీ నెలవారీ రుతుచక్రం క్రమం తప్పితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. హార్మోన్ల అసమతుల్యత లేదా అంతర్లీన అనారోగ్యం కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. పీరియడ్స్ కు సంబంధించిన ఏ సమస్య అయినా ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే పరిస్థితి చేయిదాటి పోయాక అనారోగ్యాలు బయటపడతాయి.
- అధిక రుతుస్రావం
ఏడు రోజుల కంటే ఎక్కువ రోజులు అధిక రక్తస్రావం అయితే వారు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. రోజులో నాలుగైదు సార్లు ప్యాడ్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తున్నా… అంటే అధిక రక్త స్రావం అవుతున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. ఇలా అధిక రక్తస్రావం కావడాన్ని మెనోరాగియా అంటారు. దీనికి చికిత్స అవసరం. అధికంగా రక్తం నష్టపోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రక్త నష్టం కారణంగా, మీరు అలసిపోయినట్లు అవుతారు. శక్తి హీనంగా అవుతారు. శ్వాస సరిగా ఆడదు.
2. హఠాత్తుగా రక్తస్రావం
అనుకోని రుతుస్రావం అంటే పీరియడ్స్ కాలం దాటిపోయిన తరువాత కూడా మధ్యమధ్యలో రక్తస్రావం కనిపించడం అనేది ఇబ్బందికరమైన రుతుచక్ర సమస్య. క్రమరహితంగా ఇలా రక్తస్రావం కావడం ఎన్నో సమస్యలకు కారణం కావచ్చు. ఇది అనేక అంతర్లీన వైద్య సమస్యలను సూచిస్తాయి. అందువల్ల, మీరు తరచుగా ీ సమస్యను ఎదుర్కొంటుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
3. మిస్సింగ్ పీరియడ్స్
ఒత్తిడి, అలసట వంటి కారణాల వల్ల కొన్నిసార్లు యాదృచ్ఛికంగా పీరియడ్ మిస్ అవుతాయి. కానీ దీర్ఘకాలికంగా ఇలా పీరియడ్స్ మిస్ అయితే మాత్రం దాన్ని సమస్యగానే భావించాలి. వరుసగా మూడు నెలల పాటూ పీరియడ్స్ రాకపోతే వెంటనే వైద్యుడిని కలవడం మంచిది.
4. మానసిక సమస్యలు
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు పీరియడ్స్ రావడానికి ముందు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) కావరణంగా మూడ్ స్వింగ్‌లను అనుభవించవచ్చు. కానీ మీరు తీవ్రమైన మానసిక స్థితి మార్పులు, చిరాకు, కోపం, వంటివి అనుభవిస్తే మాత్రం తేలికగా తీసుకోకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
5. మైగ్రేన్ నొప్పి
పీరియడ్స్ రావడానికి ముందు, పీరియడ్స్ ముగిసిన తరువాత తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి వేధిస్తుంటే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఇది అంతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి పీరియడ్స్ సమయంలో వచ్చే మైగ్రేన్ ను సీరియస్ గా తీసుకోవాలి.
టాపిక్