Camphor: కర్పూరాన్ని ఇలా వాడారంటే కీళ్ల నొప్పుల నుంచి గాయాల వరకు ఏవైనా తగ్గిపోతాయి, ఏ కర్పూరాన్ని ఉపయోగించాలంటే-if camphor is used like this it can reduce anything from joint pain to wounds which camphor to use ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Camphor: కర్పూరాన్ని ఇలా వాడారంటే కీళ్ల నొప్పుల నుంచి గాయాల వరకు ఏవైనా తగ్గిపోతాయి, ఏ కర్పూరాన్ని ఉపయోగించాలంటే

Camphor: కర్పూరాన్ని ఇలా వాడారంటే కీళ్ల నొప్పుల నుంచి గాయాల వరకు ఏవైనా తగ్గిపోతాయి, ఏ కర్పూరాన్ని ఉపయోగించాలంటే

Haritha Chappa HT Telugu
Sep 11, 2024 08:00 AM IST

Camphor: తెలుగు ఇళ్లల్లో ప్రతి పూజలో కర్పూరం ఉండాల్సిందే. అయితే పూజలో వెలిగించే కర్పూరం కాకుండా తినే కర్పూరం ఉంటుంది. దాన్ని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాాయి. అంతేకాదు ఆ కర్పూరాన్ని వాడడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి.

కర్పూరంతో ఆరోగ్యం
కర్పూరంతో ఆరోగ్యం (shutterstock)

ప్రతి తెలుగింట్లోని పూజ గదిలో కర్పూరం ఉంటుంది. హారతి ఇచ్చాకే పూజను పూర్తి చేస్తారు. ఇంట్లో ఇలా కర్పూరం కాల్చడం వల్ల సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు. కర్పూరాన్ని కేవలం పూజలకు మాత్రమే ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఆయుర్వేద ఔషధంగా వాడతారు. అయితే పూజలో వాడే కర్పూరం, తినే కర్పూరం ఒకటి కాదు. పూజలో వాడే కర్పూరాన్ని తినకూడదు. ఇది చాలా ప్రమాదకరం. తినే కర్పూరాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి.

తినే కర్పూరం

కర్పూరాన్ని కాంఫర్ లారెల్ అనే చెట్టులోని ఆకులు, కొమ్మల నుంచి తయారు చేస్తారు. అలాగే కొన్ని కర్పూర తులసి మొక్కల నుంచి వచ్చే పాలతో కూడా ఈ కర్పూరాన్ని తయారు చేస్తారు. ఆకులు, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో తినే కర్పూరాన్ని తయారుచేస్తారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల్లో, ఆహారంలో వాడతారు. దీన్నే పచ్చ కర్పూరం అంటారు.

పూజకు వాడే కర్పూరం

హారతి కర్పూరం, పచ్చ కర్పూరం ఒకటి కాదు. హారతి కర్పూరం బిళ్లలు తయారుచేసేందుకు టర్పైంటైన్ ఆయిల్ ను కలిపి చేస్తారు. అందుకే త్వరగా మంట అంటుకుంటుంది. కాబట్టి హారతి కర్పూరాలను తినే ఆహారాల్లో వాడకూడదు.

గాయం తగ్గడానికి

పచ్చ కర్పూరాన్ని వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కర్పూరం పొడిని గాయం తగిలిన చోట అప్లై చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు, కర్పూరం కండరాలు, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. కర్పూరాన్ని పొడి చేసి నీటిలో వేసి పేస్టులా చేసి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గి గాయం కూడా త్వరగా నయం అవుతుంది.

దురద, చుండ్రు తగ్గేలా

శరీరంలోని ఏ భాగంలోనైనా దురదగా అనిపిస్తే కర్పూరం పొడిని అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దురద పోవాలంటే కొబ్బరినూనెలో కర్పూరం వేసి దురద ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. అంతే కాదు జుట్టులోని చుండ్రు తొలగిపోవాలంటే కొబ్బరినూనెలో కర్పూరం మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. చుండ్రు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేదం కూడా ఈ చిట్కాను సమర్థిస్తోంది.

మంచి నిద్ర

రాత్రిపూట మీకు సరిగా నిద్ర పట్టకపోతే పచ్చ కర్పూరం మీకు ఔషధంలా పనిచేస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే రాత్రి పడుకునే ముందు దిండుపై కొన్ని చుక్కల కర్పూరం నూనె చల్లాలి. కర్పూరం నూనె సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రాకుండా మంచి నిద్ర పొందడానికి కూడా సహాయపడుతుంది.

పచ్చ కర్పూరం సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు రెండింటికీ ప్రయోజనకరం. తక్కువ రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా తినే కర్పూరాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.

పగిలిన పాదాలకు

కర్పూరం నూనెను ఉపయోగించడం వల్ల గ్యాస్ సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతే కాకుండా కర్పూరాన్ని వేడినీటిలో వేసి కాటన్ సహాయంతో పగిలిన మడమలపై అప్లై చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గి మృదువుగా మారుతాయి.

Whats_app_banner