Red Onion For Hairs : ఎర్ర ఉల్లిపాయలతో జుట్టు రాలడాన్ని ఎలా ఆపాలి?
Control Hair Fall With Red Onion : ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. అంతేకాదు జుట్టుకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఎర్ర ఉల్లిపాయలను ఉపయోగించి జుట్టు రాలకుండా చేయెుచ్చు.
జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను అందరూ ఎదుర్కొంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే రసాయనాలు ఉన్న ఉత్పత్తులతో జుట్టు దెబ్బతింటుంది. అందుకే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి బయటపడొచ్చు. జుట్టు రాలడానికి బెస్ట్ హోం రెమెడీ కోసం చూస్తున్నట్లయితే ఎర్ర ఉల్లిపాయ హోం రెమెడీని ప్రయత్నించొచ్చు. ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
ఎర్ర ఉల్లిపాయ రసం ఎవరికి మంచిదంటే.. అలోపేసియా చికిత్స పొందుతున్నవారికి ఉపయోగపడుతుంది. తలపై మంట, దురద ఉన్నవారు దీనిని వాడొచ్చు. అధిక జుట్టు రాలడం, పలచబడిన జుట్టు, జుట్టు చీలిపోవడం, అకాల బట్టతల, తలలో ఇన్ఫెక్షన్ ఉంటే ఎర్ర ఉల్లిపాయను ఉపయోగించొచ్చు. మంచి ఫలితం ఉంటుంది.
అయితే ఎర్ర ఉల్లిపాయను రసంగా తయారు చేసుకుని వాడుకోవాలి. పైన చెప్పిన సమస్యలు ఉంటే నయం అవుతాయి. జుట్టు రాలేవారికి ఇది ప్రభావవంతగా పనిచేస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం వల్ల మీ చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు జుట్టు రాలుతున్నప్పుడు ఉల్లిపాయ రసాన్ని రాసుకుంటే, జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.
మీకు ఉల్లిపాయలు అలెర్జీ అయితే ఉపయోగించవద్దు. ఉల్లిపాయ వాసన మీకు నచ్చకపోతే, దాని ఘాటైన వాసన మీకు చికాకు కలిగించవచ్చు. ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలంటే.. కొబ్బరి నూనె లేదా ముల్తానీ మట్టితో కలిపి జుట్టుకు పెట్టుకోవచ్చు. అరగంట తర్వాత తేలికపాటి షాంపూ అప్లై చేసి కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే 2-3 నెలల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టుపై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను చూస్తారు. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.
రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు ఎక్కువ అవుతాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.