Mustard Oil For Hairs : ఆవాల నూనెతో ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది-how to use mustard oil for white hair to black hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mustard Oil For Hairs : ఆవాల నూనెతో ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది

Mustard Oil For Hairs : ఆవాల నూనెతో ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది

Anand Sai HT Telugu
Dec 30, 2023 09:30 AM IST

Mustard Oil For Hairs In Telugu : ఆవాల నూనెను జుట్టుకు రాస్తే చాలా మంచిది. జుట్టు నల్లగా మారేందుకు ఈ నూనెను ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం..

ఆవాల నూనె
ఆవాల నూనె

నెరిసిన జుట్టుతో బాధపడేవారు ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. కొన్ని పదార్థాలను ఆవాల నూనెతో కలిపి జుట్టు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెన్నా లేదా మీ జుట్టుకు రంగు వేయవలసిన అవసరం లేదు. సహజ పదార్థాలతో జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

నిజానికి నేటి కాలంలో చిన్నారుల నుంచి టీనేజర్ల వరకు గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు. వెంట్రుకలు నెరిసిపోవడం ఒకప్పుడు వృద్ధాప్యానికి సంకేతం అయితే, ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు జుట్టు త్వరగా నెరిసిపోయేలా చేస్తున్నాయి.

వాటిని కనిపించకుండా చేసేందుకు షాపుల్లో ఎన్నో రకాల హెయిర్ డైలు దొరుకుతాయి. కానీ వాటిని వాడితే జుట్టు పాడవుతుందనేది నిజం. ఎందుకంటే ఇందులో వాడే రసాయనాలు జుట్టుకు, ఆరోగ్యానికి హానికరం. హెయిర్ కలర్, డైలో ఉండే కెమికల్స్ కారణంగా చాలా మంది స్టోర్ లో కొనే హెయిర్ కలర్ ను ఉపయోగించరు. మీరు కూడా తెల్లజుట్టుతో బాధపడుతూ సహజంగా నల్లగా మారాలని కోరుకుంటే సులభమైన పద్ధతిని ప్రయత్నించవచ్చు.

ఆవాల నూనె జుట్టుకు మంచిది. ఇందులో ఉండే పదార్థాలు జుట్టును నల్లగా, ఒత్తుగా, పొడవుగా, దృఢంగా మార్చేందుకు సహకరిస్తాయి. పూర్వకాలంలో కూడా తాతలు ఈ నూనెను జుట్టుకు రాసేవారు. ఈ నూనెలో కొన్ని పదార్థాలను ఎలా కలపాలో తెలుసుకుందాం..

ఆవాల నూనెతో ఇతర పదార్థాలను కలపడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ నూనె చాలా ప్రభావవంతమైనది, ఇది మీ జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ నూనెను ఎలా తయారుచేయాలో చూద్దాం.

ఆవాల నూనెను సిద్ధం చేయడానికి, మీకు ఒక గిన్నె ఆవాల నూనె తీసుకోవాలి. కలబంద ముక్క, కొన్ని కరివేపాకు, 2 ఉల్లిపాయలు, 1 టీస్పూన్ నల్ల జీలకర్ర అవసరం.

ఈ నూనెను సిద్ధం చేయడానికి పాన్‌లో ఆవాల నూనెను వేడి చేయండి. పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలపండి. 10-15 నిమిషాలు వేడి చేయండి. తర్వాత ఇనుప పాత్రలో పోసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నూనెను వడకట్టి మరో సీసాలో పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ నూనెను జుట్టు మూలాలకు, తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. జుట్టు మూలం నుండి కొన వరకు బాగా అప్లై చేయాలి. అవసరమైతే రాత్రిపూట నూనె రాసుకుని ఉదయం లేదా 2 గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఈ నూనెను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు జుట్టును నల్లగా, మందంగా, బలంగా మార్చడానికి సహాయపడతాయి. ఉత్తమ ఫలితాల కోసం, ఈ నూనెను వారానికి రెండుసార్లు ఉపయోగించండి. మీరు కొన్ని రోజుల్లో మంచి ఫలితాలను చూస్తారు.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు ఎక్కువ అవుతాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

WhatsApp channel