Coffee For Weight Loss : కాఫీతో బరువు తగ్గడం ఎలా? చాలా సింపుల్-how to use coffee for weight loss heres simple tips for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffee For Weight Loss : కాఫీతో బరువు తగ్గడం ఎలా? చాలా సింపుల్

Coffee For Weight Loss : కాఫీతో బరువు తగ్గడం ఎలా? చాలా సింపుల్

HT Telugu Desk HT Telugu
Oct 04, 2023 05:00 AM IST

Coffee For Weight Loss Tips : బరువు తగ్గేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రోజూవారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే.. ఈజీగా బరువు తగ్గొచ్చు. రోజూ తాగే కాఫీని బరువు తగ్గేందుకు ఉపయోగించుకోవచ్చు.

కాఫీతో బరువు తగ్గేందుకు చిట్కాలు
కాఫీతో బరువు తగ్గేందుకు చిట్కాలు (unsplash)

ఈ ప్రపంచంలో చాలా మందికి నచ్చే పానీయం కాఫీ. కొందరు బెడ్‌పై కాఫీ తాగడం ద్వారా తమ దినచర్యను ప్రారంభిస్తారు, కొంతమంది రోజుకు 10 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగుతారు. ఎప్పుడైనా తాగుతారు. ఈ కాఫీని సరైన పద్ధతిలో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని ఎక్కువ తాగకూడదు. కాఫీ మీకు ఇష్టమైనది అయితే.. మీ బరువు తగ్గించే ప్రయత్నాల్లో ఉపయోగించొచ్చు.

ముందుగా కాఫీ బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుందో చూద్దాం.. కాఫీ తాగడం వల్ల జీవక్రియలో చాలా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియ బరువును అదుపులో ఉంచుతుంది. మెటబాలిజం బాగుంటేనే అంతా బాగుంటుంది. కాఫీ ఆకలిని నియంత్రిస్తుంది. కెఫిన్ ఉండటం వల్ల కడుపులో ఆకలి తగ్గుతుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా అతిగా తినడాన్ని అరికట్టవచ్చు.

కాఫీ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత కాఫీ తాగడం వల్ల అలసట తగ్గుతుంది, వ్యాయామం వల్ల కొవ్వు తగ్గుతుంది. కాఫీ బరువు తగ్గిస్తుంది. కాఫీ తాగడం వలన గుండె ఆరోగ్యానికి మంచిది, స్ట్రోక్‌లను నివారిస్తుంది, టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో కాఫీ కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి కాఫీ ఎలా తాగాలి?

కాఫీలో బ్లాక్ కాఫీ చేస్తే బాగుంటుంది. దీనితోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. మీరు బ్లాక్ కాఫీ తాగలేకపోతే, తక్కువ కొవ్వు ఉన్న పాలు వాడండి. కానీ తీపి ఎక్కువగా వేసుకోవద్దు. దాల్చిన చెక్కను కూడా తక్కువగా వాడండి. చక్కెరను జోడించకపోతే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. కాఫీలో పంచదారకు బదులు బెల్లం వాడటం ఆరోగ్యకరం. అయితే ఎక్కువగా జోడించవద్దు.

కాఫీ తాగడం మంచిదే కానీ, ఎక్కువ కాఫీ తాగడం మంచిది కాదు. కాఫీ ఎక్కువగా తాగితే తలనొప్పి, నిద్రలేమి వంటివి వస్తాయి. వర్కవుట్ చేసే ముందు కాఫీ తాగడం మంచిది. వ్యాయామం తర్వాత కూడా కాఫీ తాగవచ్చు. కానీ చక్కెరను ఉపయోగించవద్దు, మీ వ్యాయామ ప్రయత్నం అంతా నాశనం అవుతుంది. అర్ధరాత్రి కాఫీ తాగకండి, నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. బ్యాలెన్స్‌డ్ డైట్‍తోపాటు రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగండి. ఇది బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఎక్కువగా తాగి సమస్యలు తెచ్చుకోవద్దు.

Whats_app_banner