Vaginal care: డెలివరీ తర్వాత యోని ఇన్ఫెక్షన్ ముప్పు.. ఈ జాగ్రత్తలు మరవద్దు-how to take care of vagina from infections after delivery ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vaginal Care: డెలివరీ తర్వాత యోని ఇన్ఫెక్షన్ ముప్పు.. ఈ జాగ్రత్తలు మరవద్దు

Vaginal care: డెలివరీ తర్వాత యోని ఇన్ఫెక్షన్ ముప్పు.. ఈ జాగ్రత్తలు మరవద్దు

Koutik Pranaya Sree HT Telugu
Jul 30, 2024 08:00 AM IST

Vaginal care: డెలివరీ తర్వాత మహిళల్లో యోని సంక్రమణ ప్రమాదం కూడా పెరుగుతుంది. మీరు అప్పుడే నవజాత శిశువుకు జన్మనిస్తే, డెలివరీ తర్వాత మీ యోని ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

డెలివరీ తర్వత యోని సంరక్షణ
డెలివరీ తర్వత యోని సంరక్షణ (shutterstock)

గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరం అనేక మానసిక, శారీరక మార్పులకు లోనవుతుంది. గర్భధారణ తర్వాత మహిళలు శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా యోని ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డెలివరీ తర్వాత మహిళల యోనిలో అనేక మార్పులు ఉంటాయి. దీని వల్ల అది మరింత సున్నితంగా మారుతుంది. నార్మల్ డెలివరీ తర్వాత చాలాసార్లు, యోని 'ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. ఈమధ్యే మీకు నార్మల్ డెలివరీ అయితే , డెలివరీ తర్వాత మీ యోని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వేడినీటితో శుభ్రం చేసుకోవడం:

డెలివరీ అయిన రోజుల్లో మహిళల్లో కాస్త ఎక్కువ రక్తస్రావం అవుతుంది. ఇది సాధారణంగా 4 నుండి 6 వారాల వరకు ఉండొచ్చు. ఈ సమయంలో మహిళ తన పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీని కోసం ఎప్పటికప్పుడు ప్యాడ్ మార్చడం లేదా యోనిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. పరిశుభ్రతను విస్మరిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనీసం రెండు నెలల దాకా, చెప్పాలంటే కుట్లు పూర్తిగా నయం అయ్యేదాకా మహిళలు రోజుకు కనీసం రెండుసార్లు గోరువెచ్చని నీటితో యోని దగ్గర వేసిన కుట్లను శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కుట్లు త్వరగా నయం కావడానికి ఇది సహాయపడుతుంది. డాక్టర్ సలహాతో యాంటీఆక్సిడెంట్ క్రీమ్ కూడా వాడొచ్చు.

వదులుగా ఉండే దుస్తులు:

సాధారణంగా బిగుతుగా ఉండే దుస్తులు చర్మ ఇన్ఫెక్షన్లు మరియు అలెర్జీ సమస్యలను కలిగిస్తాయి. ప్రసవానంతర సమయంలో కూడా అటువంటి దుస్తులను ధరించడం మానుకోండి. బిగుతు దుస్తులు స్త్రీ యోని ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. డెలివరీ తర్వాత ప్రారంభ నెలల్లో వదులుగా ఉండే ఇన్నర్లను మాత్రమే ధరించండి.

కూర్చునే పద్ధతి:

నార్మల్ డెలివరీ సమయంలో యోని దగ్గర ఒక చిన్న కోత చేస్తారు. దాంతో మహిళ మూత్రనాళం, మలద్వారం దెబ్బతినకుండా ప్రసవం సులువుగా జరుగుతుంది. కానీ ఈ సమయంలో ఈ కుట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇందుకోసం కూర్చునే విధానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కూర్చోవడానికి ఎప్పుడూ సౌకర్యవంతమైన మెత్తని పరుపును వాడాలి. అలాగే కనీసం నెల రోజుల పాటూ సుఖాసనంలో కూర్చోకూడదు. దీనివల్ల కుట్లపై ఒత్తిడి పెరుగుతుంది. కుర్చీలో అయితే కాళ్లు కింద పెట్టాలి. మంచం మీద అయితే కాళ్లు చాపుకుని మాత్రమే కూర్చోవాలి. డాక్టర్ సలహాతో మిగతా పనులు సులువుగా చేసుకోవచ్చు.

మూత్ర విసర్జణ తర్వాత:

మూత్ర విసర్జన తర్వాత యోనిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా పెరుగుదల ప్రారంభమవుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ప్రతిసారీ మూత్ర విసర్జన చేసిన తర్వాత, స్త్రీ తన యోనిని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మృదువైన టవల్ వాడి ఒకసారి నొక్కి నట్లు చేసి బాగా ఆరనివ్వాలి. తర్వాతే లోదుస్తులు వేసుకోవాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి ?

ప్రసవం తర్వాత స్త్రీకి రక్తస్రావం ఎక్కువగా ఉంటే లేదా ఆమె యోని నుంచి వచ్చే డిశ్చార్చికి చెడు వాసన వస్తుంటే, ఆమె వెంటనే తన వైద్యుడిని సంప్రదించాలి. ఈ రెండు పరిస్థితులను నిర్లక్ష్యం చేయడం వల్ల స్త్రీ యోని ఆరోగ్యం దెబ్బతింటుంది.

Whats_app_banner