Hair Growth Tips : మందార, ఉసిరిని ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది-how to stop hair loss with hibiscus and amla oil white hair to black hair hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Growth Tips : మందార, ఉసిరిని ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది

Hair Growth Tips : మందార, ఉసిరిని ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Sep 11, 2023 09:30 AM IST

Hair Growth Tips : జుట్టు రాలడం అనేది నేటి జీవనశైలి సమస్యల్లో ముఖ్యమైనది. మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్లతో జుట్టుకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు.

జుట్టు పెరుగుదల
జుట్టు పెరుగుదల (unsplash)

జుట్టు రాలడం(Hair Loss) సమస్య నుంచి బయటపడేందుకు అనేక చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అయిన్నప్పటికీ, అద్భుతాలు చేసే కొన్ని ఇంటి నివారణలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రభావవంతమైన నివారణలలో ఒకటి మందార, ఉసిరి నూనె మిశ్రమం. పురాతన కాలంలో జుట్టు సంరక్షణ(Hair Care)లో ఈ పదార్థాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి. జుట్టు రాలడాన్ని నిరోధించడానికి మందార, ఉసిరి మిశ్రమం శక్తివంతంగా పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపేందుకు ఈ శక్తివంతమైన హెయిర్ ఆయిల్‌(Hair Oil)ను ఎలా తయారు చేయాలో చూద్దాం..

yearly horoscope entry point

1 కప్పు ఎండిన మందార పువ్వులు, 1 కప్పు తాజా లేదా ఎండిన ఉసిరి, కొబ్బరి నూనె 2 కప్పులు తీసుకోవాలి. బాణలిలో కొబ్బరి నూనె(Coconut Oil) పోసి వేడి చేయండి. ఎండు మందార పువ్వులు, ఉసిరికాయలు కొబ్బరినూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 20 నిమిషాలు తక్కువ వేడి మీద ఉంచండి. 20 నిమిషాల తరువాత పాన్ ను తీసివేసి, మిశ్రమాన్ని చల్లగా చేసుకోవాలి. తర్వాత మందార పువ్వులు, ఉసిరికాయలను వడకట్టి నూనెను శుభ్రమైన పాత్రలో వేయాలి. మందార, ఉసిరి నూనె ఇప్పుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.

ఆ నూనెను మీ తలకు, జుట్టుకు అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. లోతైన కండిషనింగ్ కోసం కనీసం 30 నిమిషాలు లేదా రాత్రిపూట మెుత్తం ఉంచండి. తరువాత, తేలికపాటి షాంపూతో గోరువెచ్చని నీటితో మీ జుట్టును బాగా కడగాలి. మంచి ఫలితాలను పొందడానికి వారానికి 2-3 సార్లు ఈ విధానాన్ని పాటించండి.

మందార, ఉసిరి నూనెలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు మూలాలను ప్రేరేపిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు(Healthy Hair) పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మందార, ఉసిరి ఆయిల్‌లోని సహజ ప్రోటీన్లు హెయిర్ షాఫ్ట్‌ను బలోపేతం చేస్తాయి. చివర్లు చిట్లడం, చీలిపోవడం తగ్గిస్తాయి. ఈ నూనెలలోని విటమిన్లు, మినరల్స్ స్కాల్ప్‌కు పోషణను అందిస్తాయి. మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. ఈ నూనెతో జుట్టు మృదువుగా అవుతుంది.

మీ జుట్టు సంరక్షణలో మందార, ఉసిరి నూనెను జోడించడం వలన బలంగా మారుతుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

Whats_app_banner