Ragi uthappam: రాగులను మొలకెత్తించి ఇలా మిక్స్డ్ వెజ్ ఊతప్పం చేసేయండి, సింపుల్ రెసిపీ-how to make sprouted ragi mixed veg uthappam for diabetes breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Uthappam: రాగులను మొలకెత్తించి ఇలా మిక్స్డ్ వెజ్ ఊతప్పం చేసేయండి, సింపుల్ రెసిపీ

Ragi uthappam: రాగులను మొలకెత్తించి ఇలా మిక్స్డ్ వెజ్ ఊతప్పం చేసేయండి, సింపుల్ రెసిపీ

Koutik Pranaya Sree HT Telugu
Sep 21, 2024 06:30 AM IST

Ragi uthappam: రాగులను మొలకెత్తించి వాటితో ఊతప్పం చేసుకుంటే రుచితో పాటూ పోషకాలూ పెరుగుతాయి. కూరగాయలన్నీ వేసుకుని చేసే ఈ రాగి మిక్స్డ్ వెజిటేబుల్ ఊతప్పం తయారీ చూసేయండి.

మొలకెత్తిన రాగులతో ఊతప్పం
మొలకెత్తిన రాగులతో ఊతప్పం

రాగులతో రుచికరమైన వంటకాలు ఎన్నో చేసుకోవచ్చు. అందులో ఒకటి రాగి ఊతప్పం. మొలకెత్తిన రాగులతో చేసుకుంటే పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి. దీంట్లో రకరకాలు కూరగాయ ముక్కలు కూడా వేసుకుంటాం కాబట్టి మరింత ఆరోగ్యకరం. దాని తయారీ విధానమెలాగో, కావాల్సినవి ఏంటో వివరంగా చూసేయండి.

రాగి ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు రాగులు

సగం కప్పు రాగులు

కొద్దిగా కొత్తిమీర తరుగు

2 పచ్చిమిర్చి

1 ఉల్లిపాయ

1 టమాటా

2 చెంచాల బియ్యం పిండి

తగినంత ఉప్పు

2 చెంచాల పెరుగు

రాగి ఊతప్పం తయారీ విధానం:

1. ముందుగా రాగులను శుభ్రంగా కడుక్కోవాలి. రాగులను నీళ్లల్లో కనీసం 5 నుంచి 6 గంటల పాటూ నానబెట్టుకోవాలి.

2. ఇప్పుడు నీళ్లు వంపేసి ఒక జల్లెడలో రాగుల్ని పోసుకోవాలి. మీద ఏదైనా గుడ్డ లేదా మూత పెట్టుకోవాలి. ఆరేడు గంటల్లో రాగులు మొలకెత్తుతాయి.

3. మిక్సీ జార్‌లో మొలకెత్తిన రాగులు, పచ్చిమిర్చి, పెరుగు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.దీన్ని ఐదారు గంటలు పులియబెట్టాలి. ఒకవేళ సమయం లేకపోతే ఈ పిండిలో ఫ్రూట్ సాల్ట్ వేసుకుని వెంటనే చేసుకోవచ్చు.

4. ఒక పెనం పెట్టుకుని వేడెక్కాక కొద్దిగా నూనె పోసుకోవాలి. ఒక గరిటెతో పిండి వేసుకోవాలి. కాస్త మందంగానే వేసుకోవాలి. దోసెలాగా పలుచగా ఉండకూడదు.

5. మీద ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. మీకిష్టమైతే నూనె బదులుగా బటర్ వాడుకోవచ్చు.

6. ఊతప్పం రెండు వైపులా కాల్చుకోవాలి. కాస్త రంగు మారాక తీసేసి ఏదైనా సాస్ లేదా చట్నీతో సర్వ్ చేసుకోవడమే.

Whats_app_banner