Baby potato recipes: బేబీ ఆలూతో నోరూరించే షాహీ ఆలూ, స్మోకీ ఆచారీ ఆలూ టిక్కా రెసిపీలు
Baby potato recipes: చిన్న బంగాళాదుంపలు లేదా బేబీ పొటాలో ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా వాటితో రుచికరమైన మరియు ప్రత్యేకమైన వంటకాలు చేయొచ్చు. షాహీ బేబీ పొటాటో, ఆచారీ బేబీ పొటాటో టిక్కీ రెసిపీలు చూడండి.
బేబీ పొటాటోతో అదిరిపోయే వంటకాలు చేసుకోవచ్చు. అందులో షాహీ బేబీ పొటాటో, ఆచారీ బేబీ పొటాటో టిక్కా బెస్ట్ రెసిపీలు అనుకోవచ్చు. వీటి తయారీ చూసేయండి.
షాహీ బేబీ పొటాటొ తయారీకి కావాల్సినవి:
• బేబీ పొటాటో: పావు కేజీ
• నూనె: 3 టీస్పూన్లు
• సన్నగా తరిగిన టమాటా ముక్కలు: 1 కప్పు
• పెరుగు: 3 చెంచాలు
• ఎండుమిర్చి: 2
• సన్నగా తరిగిన కొత్తిమీర: గుప్పెడు
• చక్కెర: 1/2 టీస్పూన్
• ఉప్పు: రుచికి తగినంత
• దాల్చినచెక్క: 1 ముక్క
• యాలకులు: 2
• లవంగాలు: 3
• నల్ల మిరియాలు: 6 టీస్పూన్లు 1/2 టీస్పూన్
• 2 చెంచాల జీడిపప్పు
• గసగసాలు: 1 టీస్పూన్
• సన్నగా తరిగిన అల్లం: 1/2 టీస్పూన్
• వెల్లుల్లి: 3
• లవంగాలు: 2
• కారం: 1/2 టీస్పూన్
షాహీ బేబీ పొటాటొ తయారీ విధానం:
- ముందుగా బంగాళాదుంపలను ఉడికించి దాని తొక్కను తీసి పక్కన పెట్టుకోవాలి.
- వెల్లుల్లి, లవంగాలు, కారం, అల్లం, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, టమాటా ముక్కలు, జీడిపప్పు వేసి మెత్తగా మసాలా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోయాలి.
- బాణలిలో నూనె వేడి వేడెక్కాక చేసి సిద్ధం చేసుకున్న పేస్ట్ వేయాలి. మీడియం మంట మీద రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు బాణలిలో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేయాలి. మసాలా మీడియం మంట మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు మసాలా వేగాక పెరుగు కూడా వేసి కలపాలి. కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.
- మసాలా ఉడికిపోయాక కొద్దిగా పంచదార, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పావు కప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి.
- గ్రేవీ రెడీ అయ్యాక అందులో ముందుగా తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి.
- రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుని స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. షాహీ బేబీ పొటాటో రెడీ అయినట్లే.
ఆచారి బేబీ ఆలూ టిక్కా తయారీకి కావాల్సినవి:
• ఉడికించిన బేబీ పొటాటో: 12
• కండెన్స్డ్ పెరుగు: 1/2 కప్పు
• కాశ్మీరీ కారం: అరచెంచా
• సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు: 1 స్పూన్
• కసూరి మెంతి: 1 టీస్పూన్
• మిరియాల పొడి: 1/2 టీస్పూన్
• గరం మసాలా పొడి: 1/2 టీస్పూన్
• ఉప్పు: తగినంత
• ఆవనూనె: 2 టీస్పూన్లు
• నిమ్మరసం: 1 టీస్పూన్
• సన్నగా తరిగిన కొత్తిమీర: 1 టీ స్పూను
• ఉల్లిపాయలు : 1
• టొమాటోను పెద్ద ముక్కలు: 1 కప్పు
• క్యాప్సికమ్ పెద్ద ముక్కలు: 1 కప్పు
• జీలకర్ర: 1/2 టీ స్పూను
ఆచారి బేబీ ఆలూ టిక్కా తయారీ:
- ఉడికించిన బంగాళాదుంపల తొక్కను పొట్టు తీయాలి.
- ఒక ప్యాన్ వేడి చేయండి. ఆచారి మసాలాలోని అన్ని పదార్థాలను వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.
- గ్యాస్ ఆఫ్ చేసి మసాలా దినుసులు చల్లారిన తర్వాత వాటిని గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేయాలి.
- ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో పెరుగు, అన్ని మసాలా దినుసులు, తయారుచేసిన ఆచారి మసాలా, నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అన్ని పదార్థాలను బాగా కలపాలి.
- ఈ మిశ్రమంలో ఉడికించిన బంగాళాదుంపలను వేసి చేతులతో కలపాలి. అందులో తరిగిన కూరగాయలు వేసి కలపాలి.
- ఈ మిశ్రమానికి ఒక టీస్పూన్ ఆవనూనె వేసి కలపాలి.
- ఇప్పుడు బొగ్గు ముక్కను గ్యాస్ మీద కాల్చండి. మండుతున్న బొగ్గును ఒక చిన్న స్టీల్ గిన్నెలో వేయండి. ఈ గిన్నెను బంగాళాదుంప, కూరగాయలున్న పాత్ర మధ్యలో ఉంచి, పాత్రను ఫాయిల్ పేపర్ తో పది నిమిషాలు మూసేయండి.
- బార్బెక్యూ బ్యాంబూ స్టిక్ నీటిలో నానబెట్టండి. ఇప్పుడు పొటాటో, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టొమాటో ముక్కలను ఒక్కొక్కటిగా బ్యాంబూ స్టిక్ కు గుచ్చాలి. గ్యాస్ ఆన్ చేసి, వాటిని నేరుగా మంటపై గ్రిల్ చేయండి. సాస్, ఇష్టమైన చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.
టాపిక్