Fake Cashew Identify : నకిలీ జీడిపప్పు గుర్తించడం ఎలా? ఇదిగో సింపుల్ చిట్కాలు మీకోసం-how to identify fake cashew heres simple tips for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fake Cashew Identify : నకిలీ జీడిపప్పు గుర్తించడం ఎలా? ఇదిగో సింపుల్ చిట్కాలు మీకోసం

Fake Cashew Identify : నకిలీ జీడిపప్పు గుర్తించడం ఎలా? ఇదిగో సింపుల్ చిట్కాలు మీకోసం

Anand Sai HT Telugu
Feb 02, 2024 12:30 PM IST

Fake Cashew Identify In Telugu : ప్రస్తుతం మార్కెట్లో నకిలీ జీడిపప్పు కూడా ఉంటుంది. వాటిని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు మీకు తెలిసి ఉండాలి. అప్పుడే ఈజీగా గుర్తుపట్టవచ్చు.

నకిలీ జీడిపప్పు గుర్తించడం ఎలా?
నకిలీ జీడిపప్పు గుర్తించడం ఎలా? (Unsplash)

ఇటీవల నకిలీ జీడిపప్పుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి మార్కెట్లో ప్రతిదీ నకిలీవిగా తయారవుతున్నాయి. తినే ఆహారం కూడా అలానే చేసేస్తున్నారు. జాగ్రత్తగా ఉండకుంటే చాలా ప్రమాదం. కొంతమంది తక్కువ ధరకు నకిలీ జీడిపప్పు దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని అసలు వాటిలో కలిపేసి అమ్మేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా నకిలీ జీడిపప్పును మెుత్తం అమ్మకానికి పెడుతున్నారు. ఇవి తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వివిధ రకలా పిండి పదార్థాలు కలిపి ఇలా నకిలి జీడిపప్పును తయారు చేస్తుంటారు.

ఆరోగ్యం కూడా వదిలించుకుంటున్నారా?

డ్రై ఫ్రూట్స్‌లో చాలా మంది జీడిపప్పు తినేందుకు ఇష్టపడతారు. అనేక పోషకాలతో కూడిన జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్రస్తుతం దుకాణాల్లో నకిలీ జీడిపప్పు కూడా దొరుకుతోంది. కొందరు దీనిని తీపి వంటలలో కలుపుతుంటారు. కొందరు దీన్ని వేయించి తింటారు. డ్రైఫ్రూట్స్ లడ్డు చేసే సమయంలోనూ దీనిని వాడుతుంటారు. మీరు అధిక ధరకు దుకాణంలో కొనుగోలు చేసిన జీడిపప్పులు కుళ్ళిన లేదా రుచి సరిగా లేకున్నా అది నకిలీ జీడిపప్పు అని గుర్తించాలి. దీనితో డబ్బు వృథాతోపాటుగా ఆరోగ్యం కూడా వదిలించుకోవాల్సి వస్తుంది. మీరు కొనుగోలు చేస్తున్న జీడిపప్పు నకిలీదా? స్వచ్ఛమైనదా? అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఏ రంగులో ఉందో చూడాలి

జీడిపప్పు రంగు కాస్త పసుపు రంగులో ఉంటే అది నకిలీది. అయితే అది తెల్లగా ఉంటే అది స్వచ్ఛమైనది, నిజమని అర్థం. ఇది రుచిగా కూడా ఉంటుంది. తెల్ల జీడిపప్పు నాణ్యతలో కూడా అద్భుతమైనది. జీడిపప్పు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై మచ్చలు, నలుపు, రంధ్రాలు ఉంటే వాటిని కొనకండి. నకిలీ జీడిపప్పులోనూ ఇలానే ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కాదు.

తింటే ఏం రుచి వస్తుంది

నిజమైన జీడిపప్పు త్వరగా పాడవదు. అదే సమయంలో, నాణ్యత లేని జీడిపప్పు త్వరగా కుళ్ళిపోతుంది. ఇందులో కీటకాలు ఉండవచ్చు. దీని రుచి కూడా త్వరగా పాడవుతుంది. నకిలీ జీడిపప్పు రుచి వేరుగా ఉంటుంది. తింటుంటే పిండి నమిలిన ఫీలింగ్ కలుగుతుందని గుర్తుంచుకోవాలి.

జీడిపప్పు ఒక అంగుళం పొడవు, కొంచెం మందంగా ఉంటే అది నిజమైన జీడిపప్పు అయ్యే అవకాశం ఉంది. దీని కంటే పెద్ద లేదా చాలా చిన్నది నకిలీ జీడిపప్పు కావచ్చు. కొందరు హైబ్రీడ్ అంటూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అందుకే దానిని గుర్తించాలి.

జీడిపప్పు వాసన చూస్తే ఏమనిపిస్తుంది?

మీరు రెండు లేదా మూడు జీడిపప్పు వాసన చూస్తారు. మంచి వాసన ఉంటే అది నిజమైన జీడిపప్పు. ఇది జిడ్డు వాసన ఉంటే అది నకిలీ జీడిపప్పు కావచ్చు. వాసన చూసి.. కూడా నకిలీ జీడిపప్పను ఈజీగా గుర్తించవచ్చు.

జీడిపప్పు తింటున్నప్పుడు పళ్లకు అంటుకుంటే అది నకిలీ జీడిపప్పు అని అర్థం చేసుకోవాలి. అలాంటి జీడిపప్పు పళ్లలోంచి త్వరగా బయటకు రాదు. జీడిపప్పు తిన్న తర్వాత మీ దంతాలకు అంటుకోకపోతే, అది స్వచ్ఛమైన, నిజమైన జీడిపప్పు. జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటిది నకిలీ జీడిపప్పును కొని శరీరాన్ని పాడుచేసుకోవద్దు. ఎందుకంటే అందులో చాలా రకాల రసాయనాలు, వివిధ రకాల పిండి కలిపే అవకాశం ఉంది.

Whats_app_banner