రోజూ జీడిపప్పు తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Unsplash
By Anand Sai Sep 22, 2023
Hindustan Times Telugu
జీడిపప్పులో విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Unsplash
బరువు తగ్గాలనుకునేవారు.. జీడిపప్పు తింటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. జీడిపప్పు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతోపాటుగా ఆకలి కోరికను తగ్గిస్తుంది.
Unsplash
జీడిపప్పు ద్వారా పుష్కలంగా లభించే జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పర్ వంటి పోషకాలు జుట్టును మృధువుగా చేస్తాయి. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.
Unsplash
జీడి పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని క్రమబద్ధీకరిస్తుంది.
Unsplash
జీడిపప్పు ముఖం మీద ముడతలు, మచ్చలు, మెుటిమలు తగ్గించగల శక్తికూడా ఉంటుంది. ఇందులోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలే ఇందుకు కారణం.
Unsplash
రక్తహీనతతో బాధపడేవారికి జీడిపప్పు మేలు చేస్తుంది. ఇందులోని ఐరన్ రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.
Unsplash
జీడిపప్పు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మితంగానే తినాలి. మరి ఎక్కువగా తినకూడదు.
Unsplash
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..