Romantic Ideas: మీ శృంగార జీవితానికి ఇలా రొమాంటిక్ టచ్ జోడించగలిగితే, నెక్ట్స్ లెవల్ కిక్!-how to be romantic in bed room ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Romantic Ideas: మీ శృంగార జీవితానికి ఇలా రొమాంటిక్ టచ్ జోడించగలిగితే, నెక్ట్స్ లెవల్ కిక్!

Romantic Ideas: మీ శృంగార జీవితానికి ఇలా రొమాంటిక్ టచ్ జోడించగలిగితే, నెక్ట్స్ లెవల్ కిక్!

Galeti Rajendra HT Telugu
Oct 19, 2024 08:44 PM IST

Bedroom Tips: శృంగారానికి ముందు పెప్ టాక్, డర్టీ టాక్ మీ భాగస్వామిని మీకు మరింత దగ్గర చేయడంలో సహాయపడుతుంది. గది నుంచి మీ నోటి మాట వరకు రొమాంటిక్ టచ్‌ను మీరు జోడించగలిగితే.. శృంగారాన్ని మీరు బాగా ఆస్వాదించొచ్చు.

శృంగారానికి రోమాంటిక్ టచ్
శృంగారానికి రోమాంటిక్ టచ్ (iStock)

మీ భాగస్వామితో మీరు శృంగారాన్ని జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే.. కాస్త రొమాంటిక్ టచ్ జోడించాలి. చాలా మంది ఇద్దరు మనుషుల మధ్య జరిగే లైంగిక బంధంగానే శృంగారాన్ని చూస్తుంటారు. కానీ.. రెండు మనసులు కూడా ఆ బంధంలో కలిస్తేనే మీరు నిజమైన భావాప్రాప్తిని పొందగలరు. సంభోగానికి రొమాన్స్‌ను జోడించడంలో మీ డ్రెస్సింగ్ స్టయిల్, సున్నితమైన సంభాషణ, సంగీతం, గదిలో లైటింగ్ తదితర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.

చెవిలో సరదా మాట

శృంగారంలో అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి ఫోర్ ప్లే. మీ భాగస్వామితో రొమాంటిక్‌గా కబుర్లు చెప్తూ వారి దుస్తులు విప్పడానికి మీరు సహాయం చేయడం, మెడపై ముద్దులు పెడుతూ సరదాగా చెవిలో మాటలు చెప్పడం లాంటివి చేయండి. ఇది మీ భాగస్వామి శరీర స్పందనలను మీరు అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

డిమ్ లైట్‌లో ట్రై చేయండి

మీ ఫోన్‌లు నాన్‌స్టాప్‌గా రింగ్ అవుతున్నప్పుడు, టీవీ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్నప్పుడు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకురావడం కష్టం అవుతుంది. కాబట్టి రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించడానికి గదిలోని లైట్లను డిమ్ చేయండి. వీలైతే రొమాంటిక్ సాంగ్స్‌తో తక్కువ సౌండ్‌తో మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఆ పాటలు వింటూ.. వీలైతే భాగస్వామితో కలిసి పాడుతూ రొమాంటిక్ వాతావరణంలోకి తీసుకెళ్లండి.

చాలా మంది గదిలో పూర్తిగా లైట్లు ఆపేసి శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కానీ.. వారితో పోలిస్తే ల్యాంప్, నైట్‌లైట్, స్ట్రింగ్ లైట్లు లేదా పిల్లర్ క్యాండిల్స్ వెలుగులో శృంగారంలో పాల్గొనే వారు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నిపుణులు చెప్తున్నారు. డిమ్ లైట్‌లో ఒకరినొకరు చూసుకుంటూ సంభోగం.. రొమాంటిక్ స్పేస్‌ను మరింత పెంచుతుంది.

చేతలతో భరోసా

శృంగారం తర్వాత అలసిపోయి ఒకరితో మరొకరికి సంబంధం లేనట్లు చెరొక వైపు పడుకుంటే ఇక రొమాంటిక్ లైఫ్‌కి చోటు ఎక్కడుంటుంది? అలా కాకుండా ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడం లేదా ఒకరి చేతిపై మరొకరు పడుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకోండి. నువ్వు నాతో సురక్షితంగా ఉన్నావు అనే భరోసా మన భాగస్వామికి ఇవ్వగలిగితే.. వాళ్లు మనతో ఎప్పటికీ ఎమోషనల్ టచ్‌లోనే ఉంటారు.

లైన్ క్రాస్ చేయవద్దు

శృంగార జీవితంలో పెప్ టాక్, డర్టీ టాక్ కీ రోల్ ప్లే చేస్తుంటాయి. ప్రతి వ్యక్తికి చాలా భిన్నమైన ఆసక్తులు, అభిరుచులు ఉంటాయి. కాబట్టి మీ భాగస్వామితో శృంగార సమయంలో వాటిని పంచుకోవడం ద్వారా మీ రొమాన్స్ మరింత పెరుగుతుంది. అలానే శృంగార చిట్కాలను కూడా ఒకరికొకరు పంచుకోవచ్చు. కానీ.. డర్టీ టాక్ విషయంలో జాగ్రత్త. మీ భాగస్వామిని నొప్పించేలా మాట్లాడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. ఇది వైద్యపరమైన సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner