Mehendi removing tips: మెహెందీ రంగు తగ్గిందని పూర్తిగా తొలగించాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు పాటించండి
Mehendi removing tips: మెహందీని చేతి నుంచి తొలగించాలనుకుంటున్నారా? చిన్న చిట్కాల ద్వారా రంగు తగ్గిన మెహెందీని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.
పెళ్లిళ్లు, వేడుకలు ఏవైనా కూడా మహిళల చేతికి మెహందీ పెట్టుకోవాల్సిందే. మెహెందీ పెట్టుకున్నాక నాలుగు రోజుల రంగులు బాగానే ఉంటుంది. తరువాత మసకబారడం మొదలవుతుంది. పొరలు పొరలుగా రాలిపోతూ కనిపిస్తుంది. అలాంటప్పుడు చేయి చూసేందుకు అంత అందంగా కనిపించదు. అలాంటిప్పుడు మెహెందీ రంగును పూర్తిగా తొలగించుకోవాలనుకుంటారు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మెహెందీ రంగును తొలగించుకోవచ్చు.
మెహందీ వేసుకునే సమయంలో డిజైన్ అనుకున్నట్టు రాకపోయినా కూడా దాన్ని తొలగించాలనిపిస్తుంది. కానీ సెకన్లలోనే మెహెందీ పండిపోతుంది కాబట్టి దాన్ని తొలగించడం కష్టంగా మారిపోతుంది. అలాంటప్పుడు కూడా సులువైన పద్ధతిలో మెహెందీని తొలగించుకోవచ్చు.
మెహెందీ తొలగించడం ఎలా?
మెహెందీ రంగు మసకబారాక లేదా మెహందీ డిజైన్ బాగోకపోయినా దాన్ని వదిలించుకునేందుకు చిన్న చిట్కాలను పాటించండి. ఇంట్లో ఉండే వైట్ టూత్ పేస్ట్, పంచదారను తీసుకోండి. అలాగే పాదాలను శుభ్రపరిచే లూఫా క్లాత్ కూడా దగ్గర పెట్టుకోండి.
ముందుగా టూత్ పేస్ట్ ను చేతులకు అప్లై చేసి పైన చిటికెడు పంచదార వేయాలి. ఇప్పుడు తేలికపాటి చేతులతో స్క్రబ్ చేయండి. ఈ టూత్ పేస్ట్ పూర్తిగా ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి మరోసారి లూఫా సాయంతో స్క్రబ్ చేయండి. అయిదు నిమిషాల రుద్దడం వల్ల గోరింటాకులోని అన్ని రంగులు తొలగిపోయి చేతులు పూర్తిగా శుభ్రమవుతాయి.
బేకింగ్ సోడాతో…
మెహెందీ రంగును తొలగించుకోవాలంటే నిమ్మరసంలో బేకింగ్ సోడా కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను అరచేతిలో అప్లై చేసి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి. తరువాత చేతిపై రుద్దాలి. ఇలా కాసేపు చేస్తే మెహెందీ డిజైన్ పోతుంది.
మెహెందీ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ ఇది పడకపోవచ్చు. దీన్ని సాధారణ గోరింటాకు అనుకుంటారు కానీ ఇందులో రసాయనాలు కలిసి ఉంటాయి. బయట దొరికే మెహెందీ కోన్లలో సాధారణ గోరింటాకు పేస్టు ఉండదు. అందులో పారాఫినైలిన్ డయామైన్ (పీపీడీ) అని పిలిచే రసాయనం ఉంటుంది. ఇదే చేతును ముదురు ఎరుపు రంగులో పండేలా చేస్తుంది.
మెహెందీ పెట్టడం వల్ల పీపీడీ రసాయనం కొందరికి తీవ్ర అలెర్జీలు వస్తాయి. చర్మ సమస్యల బారిన తరచూ పడేవారు బయట దొరికే మెహెందీకి దూరంగా ఉండడం ఎంతో మంచిది.
టాపిక్