Effective Diet Plan: నెలరోజుల్లో బరువు తగ్గేందుకు బాబా రామ్‌దేవ్ చెబుతున్న డైట్ ప్లాన్ ఇదిగో-here is baba ramdevs diet plan to lose weight in a month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Effective Diet Plan: నెలరోజుల్లో బరువు తగ్గేందుకు బాబా రామ్‌దేవ్ చెబుతున్న డైట్ ప్లాన్ ఇదిగో

Effective Diet Plan: నెలరోజుల్లో బరువు తగ్గేందుకు బాబా రామ్‌దేవ్ చెబుతున్న డైట్ ప్లాన్ ఇదిగో

Haritha Chappa HT Telugu
Sep 05, 2024 04:30 PM IST

Effective Diet Plan: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. బాబా రాందేవ్ చెప్పిన డైట్ ప్లాన్ మీ కోసం తీసుకువచ్చాము. ఈ డైట్ ప్లాన్ ను ఫాలో అవడం వల్ల నెల రోజుల్లోనే మీ బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

రామ్ దేవ్ బాబా చెప్పిన వెయిట్ లాస్ రహస్యాలు
రామ్ దేవ్ బాబా చెప్పిన వెయిట్ లాస్ రహస్యాలు (pexel)

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో కూడా తెలుసుకోలేని పరిస్థితి. మారిన జీవనశైలి, ఆహారం కారణంగా ఊబకాయం ఒక సమస్యగా మారుతోంది. ఊబకాయం వచ్చిందంటే… తనతో పాటూ అనేక వ్యాధులను తీసుకువస్తుంది. ఒకసారి బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి చాలా కష్టపడాలి.

మీరు కూడా మీ పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడున్నా, దానిని తగ్గించుకోవాలనున్నా ఇక్కడ మేము ఒక ప్రభావవంతమైన డైట్ ప్లాన్ ఇచ్చాము. ఈ డైట్ ప్లాన్ యోగా గురు స్వామి రాందేవ్ చెప్పినది. ఆయన ఆయుర్వేద ఆహారం ద్వారా నెలరోజుల్లో బరువు తగ్గవచ్చు. ఆరోగ్యం విషయంలో బాబా రాందేవ్ ఎంతో జాగ్రత తీసుకుంటారు. ఈ డైట్ ప్లాన్ లో చాలా సులభమైన మార్గాలను ఆయన చెప్పారు. దీని సహాయంతో మీరు ఒక నెలలోనే చాలా బరువు తగ్గవచ్చు. బాబా రాందేవ్ బరువు తగ్గడం కోసం ఏంతినాలని చెప్పారంటే…

బ్రేక్ ఫాస్ట్ లో తినాల్సినవి?

మీరు మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే, క్రమం తప్పకుండా అల్పాహారంలో బలవర్థకమైన ఆహారం తినండి అని బాబా రాందేవ్ చెబుతున్నారు. గోధుమలు, చిరుధాన్యాలు, పెసరపప్పు, బియ్యం, నువ్వులు, సెలెరీ వంటి వాటితో వండిన ఆహారాన్ని తినాలి. పైన చెప్పిన వాటితో సూప్ లాంటివి తయారుచేసుకుని తాగితే మంచిది. దీన్ని అల్పాహారంలో తిన్న తర్వాత ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉండటం వల్ల ఆకలి దరిచేరదు. వీటితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. ఉదయం అల్పాహారంలో క్రమం తప్పకుండా ఓట్ మీల్ తీసుకోవడం ద్వారా బరువును చాలా వరకు నియంత్రించవచ్చు.

సొరకాయ జ్యూస్

బరువు తగ్గించడంలో సొరకాయ జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని బాబా రాందేవ్ చెబుతున్నారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండి ఆకలిని నియంత్రిస్తుంది. సొరకాయ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల పెరిగిన బరువు వేగంగా నియంత్రణలోకి వస్తుంది. మీరు మీ రోజును సొరకాయ రసంతో ప్రారంభిస్తే ఎంతో ఆరోగ్యకరం.

అశ్వగంధ పొడి

మార్కెట్లో అశ్వగంధ పొడి, అశ్వగంధ ఆకులు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా నెల రోజుల్లో 15 నుంచి 20 కిలోల బరువు తగ్గవచ్చని బాబా రాందేవ్ చెబుతున్నారు. అశ్వగంధ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. దీన్ని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా అశ్వగంధ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు విచ్ఛిన్నమైపోతుంది.

పైన చెప్పిన ఆహారాలు తినడంతో పాటూ ప్రతిరోజూ వాకింగ్ చేయాలి. అలాగే శ్వాస వ్యాయామాలు చేయాలి. రోజుకో అరగంట వేగంగా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాందేవ్ బాబా శ్వాస వ్యాయామాలకు కూడా ఎంతో విలువ ఇస్తారు.

టాపిక్