Vinayaka Chavithi Sweet Recipes: బొజ్జ గణపయ్యకు స్వీట్ ప్రసాదాల రెసిపీలు ఇదిగోండి, తక్కువ పదార్థాలతోనే ఇవి వండేయచ్చు-here are the sweet prasadam recipes for vinayaka chavithi which can be cooked with less ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vinayaka Chavithi Sweet Recipes: బొజ్జ గణపయ్యకు స్వీట్ ప్రసాదాల రెసిపీలు ఇదిగోండి, తక్కువ పదార్థాలతోనే ఇవి వండేయచ్చు

Vinayaka Chavithi Sweet Recipes: బొజ్జ గణపయ్యకు స్వీట్ ప్రసాదాల రెసిపీలు ఇదిగోండి, తక్కువ పదార్థాలతోనే ఇవి వండేయచ్చు

Haritha Chappa HT Telugu
Sep 06, 2024 05:40 PM IST

Vinayaka Chavithi Sweet Recipes: వినాయక చవితి రోజు స్వీట్ రెసిపీలో కచ్చితంగా ఉండాల్సిందే స్వీట్లు వండాలంటే చాలామంది భయపడిపోతారు నిజానికి కొన్ని స్వీట్ రెసిపీ వినాయక చవితి స్వీట్ రెసిపీలు కొన్ని ఇక్కడ ఇచ్చాము.

వినాయక చవితి స్వీట్ ప్రసాదం రెసిపీలు
వినాయక చవితి స్వీట్ ప్రసాదం రెసిపీలు

Vinayaka Chavithi Sweet Recipes: వినాయక చవితికి కచ్చితంగా కొన్ని స్వీట్ రెసిపీలు ఉండాల్సిందే. స్వీట్ రెసిపీలు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. వాటిని చేయడం కష్టమేమో అనుకుంటారు. తక్కువ పదార్థాలతోనే టేస్టీ స్వీట్ రెసిపీలు ఇక్కడ ఇచ్చాము. ప్రతి ఒక్కరూ వీటిని చాలా సులువుగా చేసేయచ్చు.

పాలు పోలీ

పాలు పోలీ రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - రెండు కప్పులు

ఉప్మా రవ్వ - పావు కప్పు

యాలకుల పొడి - చిటికెడు

కుంకుమపువ్వు - రెండు రేకులు

పాలు - మూడు కప్పులు

నూనె - వేయించడానికి సరిపడా

బాదం పలుకులు - గుప్పెడు

పంచదార - పావుకప్పు

పాల్ పోలీ రెసిపీ

1. ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్మా రవ్వ వేసి చేతితోనే కలుపుకోవాలి.

2. ఒక స్పూన్ నూనెను కూడా వేయాలి.

3. తర్వాత నీళ్లను వేసి పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

4. వాటితోనే పూరీల్లా ఒత్తి నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి.

5. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు కుంకుమపువ్వు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.

6. పాలు చిక్కబడుతున్నప్పుడు పంచదార, యాలకులు పొడి కూడా వేయాలి.

7. పాలను చిన్న మంట మీద ఎక్కువ సేపు మరిగిస్తే పాలు త్వరగా చిక్కబడతాయి.

8. పంచదార పాలల్లో కలిసిపోయాక పూరీలను సగానికి మడిచి అందులో వేసి నానబెట్టాలి.

9. పైనా బాదం పలుకులు చల్లుకోవాలి.

10. అంతే టేస్టీ పాల్ పోలి రెడీ అయినట్టే.

11. ఇది చాలా రుచిగా ఉంటుంది. తినాలనిపించేలా ఉంటుంది.

......……………………………………………............................................

సగ్గుబియ్యం లడ్డూలు

సగ్గుబియ్యం లడ్డూలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

సగ్గుబియ్యం - ఒక కప్పు

కొబ్బరి తురుము - పావు కప్పు

యాలకుల పొడి - చిటికెడు

పంచదార పొడి - ముప్పావు కప్పు

పాలు - పావు కప్పు

పల్లీలు - ఒక కప్పు

నెయ్యి - నాలుగు స్పూన్లు

సగ్గుబియ్యం లడ్డూ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి సగ్గుబియ్యాన్ని రెండు నిమిషాలు వేయించుకోవాలి.

2. తర్వాత తీసి మిక్సీజార్లో మెత్తగా పొడి చేసుకోవాలి.

3. సగ్గుబియ్యంలాగే పల్లీలను కూడా వేయించి పొట్టును తీసేయాలి.

4. ఆ తర్వాత వాటిని కూడా సగ్గుబియ్యంలోనే వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

5. ప్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి సగ్గుబియ్యం పొడి, పల్లీల పొడిని వేసి వేయించుకోవాలి.

6. అందులో కొబ్బరి తురుమును కూడా వేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.

7. కాచి చల్లార్చిన పాలను మెల్లగా అందులో వేస్తూ చేతితోనే లడ్డూల్లా చుట్టుకోవాలి.

8. అంతే టేస్టీ సగంగె బియ్యం లడ్డూ రెడీ అయినట్టే.

..................................……………………………………………….

పాలపొడి బర్ఫీ

పాలపొడి బర్ఫీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పాలపొడి - ముప్పావు కప్పు

కుంకుమపువ్వు - నాలుగు రేకులు

నట్స్ - గుప్పెడు

నెయ్యి - మూడు స్పూన్లు

పాలపొడి బర్ఫీ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

2. అందులో పాలు వేసి చిన్న మంట మీద మరిగిస్తూ ఉండాలి.

3. కొంచెం కొంచెంగా పాల పొడిని కూడా వేసుకొని గరిటతో కలుపుతూ ఉండాలి.

4. ఆ తర్వాత పంచదార పొడిని కూడా వేసి బాగా కలపాలి.

5. ఇది కళాయికి అంటుకుపోకుండా ముందుగానే గరిటతో కలుపుతూ ఉండాలి.

6. ఈ మిశ్రమం దగ్గరగా గట్టిగా అయ్యేవరకు కలపాలి.

7. కుంకుమపువ్వు నానబెట్టిన పాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

8. ఇప్పుడు ఒక ప్లేట్ కి నూనె లేదా నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని వేయాలి.

9. అది చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవసరమైతే పైన వేడి నెయ్యిని చల్లుకోవచ్చు. అంతే టేస్టీ పాలపొడి వరకు రెడీ అయినట్టే.

10. ఇది చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

.............................…………………………………………………….……….

బాసుంది రెసిపీ

బాసుంది రెసిపీకి కావలసిన పదార్థాలు

చిక్కటి పాలు - ఒక లీటరు

యాలకుల పొడి - పావు స్పూను

బాదం, పిస్తాలు - గుప్పెడు

చక్కెర - ముప్పావు కప్పు

బాసుంది రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి మందపాటి గిన్నెను పెట్టాలి.

2. అందులో పాలు వేసి మరిగించాలి. చిన్న మంట మీద మరిగిస్తే కాసేపటికి పాలు రంగు మారుతాయి.

3. కనీసం ఒక గంట పాటు మరిగిస్తే వాళ్ళు రంగు మారి మంచి సువాసన వస్తాయి.

4. అప్పుడు అంచులకు పాల క్రీమ్ అంటుకుంటూ ఉంటుంది.

5. దాన్ని కూడా గరిటతో తీసి మళ్లీ పాలను కలుపుతూ ఉండాలి.

6. ఈ సమయంలో అందులో పంచదార వేసి బాగా కలపాలి.

7. తర్వాత యాలకులు పొడిని కూడా వేసి బాగా కలపాలి.

8. ఈ మిశ్రమం కాస్త చిక్కగా అవుతూ ఉంటుంది.

9. ఆ సమయంలో బాదం, పిస్తాలను తరిగి చల్లుకోవాలి. అంతే టేస్టీ బాసుంది రెడీ అయినట్టే.