Fennel For Weight Loss । సోంపును ఇలా గనక తింటే.. వేగంగా బరువు తగ్గిపోతారట!
అధిక బరువు, ఊబకాయం తదితర సమస్యలతో ఇబ్బందిపడుతుంటే వేగంగా బరువు తగ్గేందుకు సోంపు (Fennel) తినవచ్చు. అయితే అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
హోటళ్లు, రెస్టారెంట్లలో లేదా పార్టీలకు వెళ్లినపుడు విందు భోజనం తర్వాత సోంపు ఇస్తారు. మనలో చాలా మందికి కూడా భోజనం తర్వాత సోంపు తినడం అలవాటు. అయితే ఇది మంచి అలవాటే. కానీ సరైన విధానంలో సోంపు తీసుకోవటం వలన మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
సోంపు తినడం వల్ల జీర్ణక్రియ, జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సోంపు గింజలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు సోంపులో పుష్కలంగా ఉండటం మూలానా ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మధుమేహం వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. బరువు తగ్గటంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా సోంపును వివిధ మార్గాల్లో తీసుకోవాలి.
Fennel For Weight loss: వేగంగా బరువు తగ్గేందుకు సోంపును ఏ విధంగా తీసుకోవచ్చో ఇక్కడ జాబితా చేసిన కొన్ని ఆప్షన్లను పరిశీలించండి.
సోంపు పొడి
ఒక పిడికెడు సోంపు తీసుకుని దీనిని బాగా గ్రైండ్ చేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నల్ల ఉప్పు, ఇంగువ, పటికబెల్లం కలపాలి. ఈ చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో ఒక చెంచా కలిపి, కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే మంచి రుచిగా ఉంటుంది. జీర్ణక్రియ పెరుగుతుంది. ప్రతిరోజూ ఇలా తాగటం వలన వేగంగా బరువు తగ్గవచ్చు.
కాల్చిన సోంపు
ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను తీసుకుని వాటిని తక్కువ మంట మీద వేయించాలి. చల్లారిన తర్వాత ఇందులో రుచికోసం కొద్దిగా పటికబెల్లం కూడా కలుపుకోవచ్చు. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత ఈ సోంపు తినాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు స్వీట్స్, చిరుతిళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఈ రకంగా మీరు వేగంగా బరువు తగ్గటంలో సహాయపడుతుంది.
సోంపు నీరు
కడుపులో మంట తగ్గించడానికి, ఆహారం త్వరగా జీర్ణం అవటానికి సోంపు నీరు తీసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో కొంచెం సోంపు వేసి రాత్రంతా నానబెట్టండి. దీన్ని ఉదయాన్నే లేచి తాగాలి. ఇలా తాగితే మనం తినే ఆహారం నుంచి విటమిన్లు, ఖనిజాల శోషణ పెరుగుతుంది. తద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోజు ఉదయం ఒక గ్లాసు, అలాగే సాయంత్రం ఒక గ్లాసు ఇలా సోంపు నీరు తాగాలి. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఇది చక్కటి మార్గం.
ఫెన్నెల్ టీ
సోంపుతో టీ కూడా చేసుకోవచ్చు. సాయంత్రం సమయాన్ని ఒక కప్పు నీరు మరిగించి అందులో ఒక చెంచా సోంప్ వేయండి. అలాగే అర టేబుల్ స్పూన్ బెల్లం వేసుకిని వేడివేడిగా సోంపు టీని ఆస్వాదించండి. వేగంగా బరువు తగ్గుతారు.
సంబంధిత కథనం