Fitness Secrets: యాభై ఆరేళ్ల వయసులో అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవిగో...
Fitness Secrets: ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ ఫిట్‌నెస్ సూత్రాలను పాటించే వారి సంఖ్య చాలా తక్కువ.
Fitness Secrets: అక్షయ్ కుమార్ చాలా ఫిట్‌గా ఉంటారు. అతని కండలు తిరిగిన శరీరం చూస్తే జిమ్‌లో గంటలు గంటలు గడుపుతారని అందరూ అనుకుంటారు. నిజానికి ఆయన జిమ్‌లో గడిపే సమయం తక్కువే. ఫిట్‌గా ఉండేందుకు ఆయన ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తారు. ఆరోగ్యంగా ఫిట్‌గా ఎలా ఉంటారో తన అభిమానులతో పంచుకున్నాడు. అక్షయ్ తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.
1. చాలామంది ఫిట్‌గా ఉండాలన్న కోరికతో ఇష్టమైన ఆహారాలను త్యాగం చేస్తారు. అక్షయ్ కుమార్ అలా చేయరు. తనకిష్టమైన ఆహారాలన్నీ తింటారు. అయితే ఇంట్లో ఉండిన ఆహారాన్ని మాత్రమే తింటారు. బయట ఆహారాన్ని పూర్తిగా మానేశారు. పండ్లకు ప్రాధాన్యత ఇస్తారు. తాను తినే ఆహారంలోఆరోగ్యకరమైన ఆహారమే ఉండేలా చూస్తారు. ఆకలితో ఎప్పుడూ ఉండరు.
2. ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో... ఫిట్‌నెస్ కోసం తగినంత నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. సమయానికి నిద్రపోయి, ఉదయాన త్వరగా లేచి ఫ్రెష్ మైండ్‌తో జిమ్ చేయడం చాలా ముఖ్యమని చెబుతారు. అక్షయ్ రాత్రి తొమ్మిది గంటలకే పడుకొని, తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేస్తారు. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేవడం వల్ల చాలా తాజా మైండ్ ఉంటుందని, తనతో తాను కొంత సమయం గడిపేందుకు టైం దొరుకుతుందని చెబుతారు అక్షయ్. ఆ సమయంలో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంపై మంచి ప్రభావం కూడా పడుతుందని వివరిస్తున్నారు.
3. అక్షయ్ కుమార్ ప్రతిరోజూ ఒక గంట వ్యాయామానికే కేటాయిస్తారు. ఆ వ్యాయామంలో చాలా రకాల వర్కౌట్స్ చేస్తారు. వీలు లేని వాళ్ళు గంట పాటు వాకింగ్ చేసినా చాలని చెబుతున్నారు. అక్షయ్ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక గంట మాత్రం వర్కవుట్స్ చేస్తారు.
4. ఆధునిక జీవితంలో శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎంతో మంది కెరీర్ లక్ష్యాలను సాధించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తూ, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అలాంటివారు కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాదు మానసిక ఆరోగ్యానికి కొంత సమయాన్ని కేటాయించాలని చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామాలు కూడా సహాయపడతాయని అంటున్నారు అక్షయ్. కాబట్టి ప్రతిరోజూ చిన్న చిన్న వ్యాయామాలను కచ్చితంగా చేయమని సూచిస్తున్నారు.
5. ఎవరైనా ఫిట్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంటే పైన చెప్పిన నియమాలను కచ్చితంగా పాటించాలి. వ్యాయామాలు, ఆహారం, నిద్రా... అన్నీ సమయానికి శరీరానికి అందేలా చూడాలి. అప్పుడే శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది.