Drinks That Boost Libido । మీ శృంగార జీవితం బాగుండాలంటే.. తాగాల్సినవి ఇవీ!-healthy drinks that boost libido have a happy ending ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinks That Boost Libido । మీ శృంగార జీవితం బాగుండాలంటే.. తాగాల్సినవి ఇవీ!

Drinks That Boost Libido । మీ శృంగార జీవితం బాగుండాలంటే.. తాగాల్సినవి ఇవీ!

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 09:15 PM IST

Drinks That Boost Libido: మారుతున్న జీవనశైలి కారణంగా స్త్రీ, పురుషులలో శృంగారంపై ఆసక్తి తగ్గుతోంది. మీ సెక్స్ డ్రైవ్ మెరుగుపడాలంటే ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఉన్నాయి.

Drinks That Boost Libido
Drinks That Boost Libido (Unsplash)

ఈరోజుల్లో నిరంతరమైన ఒత్తిడి, ఆందోళలనలు శృంగార జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లైంగిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మగవారిలో అయితే అంగస్తంభన సమస్యలు, వీర్యం నాణ్యత తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటున్నాయి. అదే సమయంలో ఆడవారిలో యోని పొడిబారడం, హార్మోన్ల అసమతుల్యత, నెలసరి సమస్యలు, అండం సమస్యలు, పీసీఓడీ వంటివి ఉంటున్నాయి. సెక్స్ పట్ల ఆసక్తి సన్నగిల్లడం, కీళ్ల నొప్పులు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. వీటి నుంచి బయటపడాలంటే ఒత్తిడి లేని జీవనశైలిని అవలంబించడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే మార్గాలు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Drinks That Boost Libido - శృంగార ఆసక్తిని పెంచే పానీయాలు

కొన్ని పానీయాలు తాగడం ద్వారా మీ సెక్స్ డ్రైవ్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఇవి ఒత్తిడి తగ్గించి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా మీరు శృంగార జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావచ్చు. అందుకు సహాయపడే పానీయాలు ఇక్కడ చూడండి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువు తగ్గడానికి మాత్రమే కాదు. ఇది మీ సెక్స్ డ్రైవ్‌ను కూడా పెంచుతుంది. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మీ లిబిడోను కూడా పెంచుతుంది.

బ్లాక్ కాఫీ

కాఫీ మీ మూడ్‌ని మారుస్తుంది. దీని వినియోగం మానసిక స్థితికి మాత్రమే కాకుండా లైంగిక ఆసక్తిని కూడా ప్రేరేపిస్తుంది. ఇందులోని కెఫిన్ కంటెంట్ శరీరంలోకి చేరడం వల్ల స్త్రీ, పురుషులిద్దరికీ ఇది మేలు చేస్తుంది. హోస్టన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ 2015లో ఒక అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం, ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగే పురుషులకు అంగస్తంభనలు గొప్పగా ఉంటాయని పేర్కొంది.

రెడ్ వైన్

జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం, రెడ్ వైన్ తాగడం వల్ల పురుషులు, మహిళలు ఇద్దరిలో లైంగిక ప్రేరేపణ పెరుగుతుందని పేర్కొంది. రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగడం వల్ల మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. రెడ్ వైన్ పురుషులలో టెస్టోస్టెరాన్‌ను పెంచుతుంది. కానీ దాని అధిక వినియోగం మంచిది కాదు.

బనానా షేక్

అరటి షేక్ మిమ్మల్ని రుచిలోనూ, శృంగార రుచిలోనూ నిరాశపరచదు. ఈ షేక్ మీకు శారీరక శక్తిని ఇచ్చి మిమ్మల్ని షేక్ చేస్తుంది. అలాగే మీ సెక్స్ డ్రైవ్‌ను పెంచుతుంది. అరటిపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషులలో లిబిడో, టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది.

దానిమ్మ రసం

సెక్స్ హార్మోన్లను పెంచడంలో దానిమ్మ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమెరికాలోని బెవర్లీ హిల్స్ క్లినిక్‌లో ఓ అధ్యయనం జరిగింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ రీసెర్చ్ ప్రకారం, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం