Walking Backward : వెనక్కి వాకింగ్ చేస్తే.. ఎన్నో ప్రయోజనాలు-health benefits of walking backward details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walking Backward : వెనక్కి వాకింగ్ చేస్తే.. ఎన్నో ప్రయోజనాలు

Walking Backward : వెనక్కి వాకింగ్ చేస్తే.. ఎన్నో ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu
Feb 25, 2023 09:06 AM IST

Walking Backward Benefits : వాకింగ్ అంటే ముందుకు చేయడమే. ఇది సాధారణంగా నడిచే పద్ధతి. దీనిద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వెనక్కి నడిస్తే.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రోజు వాకింగ్(Walking) చేస్తే.. చాలా హెల్తీగా ఉంటాం. అనేక రకమైన రోగాలను దూరం చేసుకోవచ్చు. శరీరం(Body), మానసిక ఉల్లాసం ఉంటుంది. డయాబెటిస్‌, కొలెస్ట్రాల్‌, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే రివర్స్ వాకింగ్(Reverse Walking) చేస్తే కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొత్తగా అనిపించినా.. ఇలా చేసే వారూ ఉన్నారు.

కొంతమంది వెనక్కు కూడా వాకింగ్(Backward Walking) చేస్తూ ఉంటారు. ముందు వాకింగ్‌ చేయడంతోపాటు వెనక్కి వాకింగ్‌ చేయడం కారణంగా లాభాలు ఉంటాయి. ముందు వాకింగ్‌ కంటే రివర్స్ వాకింగ్ తో ఫలితాలు కలుగుతాయి. రోజులో 10 నుంచి 20 నిమిషాల పాటు వెనక్కి వాకింగ్‌ చేస్తే అది వారంలో 2 నుంచి 3 సార్లు జాగింగ్‌ చేసిన దానితో సమానం. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

వెనక్కు వాకింగ్ చేస్తే.. ఎక్కువ క్యాలరీల శక్తిని ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో కొవ్వు త్వరగా కరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. వెనక్కి వాకింగ్‌ చేయడంతో శరీరం బ్యాలెన్స్‌(Body Balenced)ను పొందుతుంది. స్థిరంగా ఉంటారు. వెనక్కు వాకింగ్ చేస్తే.. కాస్తంత జాగ్రత్తగా ఉంటారు. పరిసరాలపై అప్రమత్తత పెరుగుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

వెనక్కి నడవడం అనేది.. ఒక కొత్త రకమైన ఛాలెంజ్. దీనితో శారీరక ఆరోగ్యం(Health) మెరుగు అవుతుంది. శరీరం కూడా ఫిట్ గా ఉంటుంది. ముందుకు వాకింగ్ చేస్తే.. కొన్ని కండరాల్లో కదలికలు ఉండవు. అయితే వెనక్కు వాకింగ్ చేస్తే.. అలాంటి కండరాల్లో కదలికలు ఉంటాయి. దీంతో కండరాలు ధృడంగా ఉంటాయి. వెనక్కి వాకింగ్ చేస్తే.. కాళ్లు, కళ్లు కదలికలు మెరుగ్గా ఉంటాయి. అవయవాలు సమన్వయం చేసుకుంటాయి. ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది. మెదడు పనితీరు కూడా మెరుగు అవుతుంది.

రోజూ చేసే సాధారణ వాకింగ్ చేస్తే.. ప్రాక్టిస్ కొత్తగా ఉంటుంది. వెనక్కి నడవడం కారణంగా.. 35 నుంచి 40 శాతం శక్తి అధికంగా ఖర్చు అవుతుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్(Oxygen) అధికంగా అందుతుంది. కండరాల నొప్పులు, మడమల నొప్పులు తగ్గుతాయి. అయితే మెుదట్లో కాస్త ఇబ్బందే.. అలవాటు అయితే బాగానే ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం