Women's Day 2023 । మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. స్త్రీ శక్తి ఎంతో ఘనం, ఇదే నేటి సందేశం!
International Women's Day 2023: ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మీ జీవితంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు, తెలుగులో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, సూక్తులు ఇక్కడ ఉన్నాయి.
International Women's Day 2023: ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ రోజున మహిళల హక్కులు, సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష- లింగ సమానత్వంపై చర్చలు, వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలు మొదలైన అనేక అంశాలపై సమాజం దృష్టికి తీసుకు రావడానికి ఇది ఒక సందర్భం. ఈ సంవత్సరం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 థీమ్ #EmbraceEquity. ప్రపంచానికి 'సమాన అవకాశాలు ఎందుకు సరిపోవు' అనే లక్ష్యం గురించి మాట్లాడేలా చేస్తుంది.
భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా మహిళలు పురుషుల జీవితంలో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం అంకితం ఇస్తున్నారు. అలాంటి స్త్రీమూర్తులందరికీ గౌరవించేలా మహిళా దినోత్సవం రోజును జరుపుకోవాలి. మహిళా దినోత్సవం స్ఫూర్తిని ప్రతీరోజు కొనసాగించాలి. మీరు కూడా మీ జీవితంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయండి. స్త్రీ శక్తిని చాటండి.
ఈ ప్రత్యేకమైన సందర్భంలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు Happy Women's Day 2023 Quotes, Women's Day Greetings, Women Power Messages, Women's Day Wishes, ఇక్కడ అందిస్తున్నాం. మహిళల సాధికారత, స్త్రీ శక్తిని తెలిపే సందేశాలను మహిళలతో పంచుకొని వారికి గౌరవం ఇవ్వడంలో మీరు భాగం అవ్వండి, ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు అనే సందేశాన్ని ఇవ్వండి, వారిని ఆనందంగా ఉంచండి.
Happy Women's Day 2023- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
జననం నీవే.. గమనం నీవే
సృష్టివి నీవే.. ప్రతిసృష్టివి నీవే
కర్తవు నీవే.. కర్మవు నీవే
ఓ మహిళా నీకు వందనం!
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!!
అమ్మను పూజించు, సోదరిని దీవించు,
భార్యను ప్రేమించు.. మహిళలను గౌరవించు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
కన్నతల్లిగా లాలించగలవు, కనుసైగతో పాలించగలవు
కల్మషం లేని ప్రేమను అందించగవు.. ఓ మహిళా అందుకే నీకు ప్రణామం.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా"
ఎక్కడైతే స్త్రీ గౌరవం పొందుతుందో అక్కడే సకల దేవతలు కొలువై ఉంటారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
మహిళలందరికీ హిందుస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
సంబంధిత కథనం