women's day gift : 5 బెస్ట్​ టెక్​ గిఫ్ట్స్​.. మీ జీవితంలోని మహిళల కోసం!-womens day 2023 5 best tech gifts under 10000 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Women's Day 2023 5 Best Tech Gifts Under 10000- Check Full Details Here

women's day gift : 5 బెస్ట్​ టెక్​ గిఫ్ట్స్​.. మీ జీవితంలోని మహిళల కోసం!

Sharath Chitturi HT Telugu
Mar 05, 2023 08:35 PM IST

women's day gifts under 10000 : 2023 మహిళా దినోత్సవం నేపథ్యంలో.. రూ. 10వేల బడ్జెట్​లో బెస్ట్​ టెక్​ గిఫ్ట్స్​ లిస్ట్​ను మీకోసం రూపొందించాము. వీటిపై మీరూ ఓ లుక్కేయండి..

5 బెస్ట్​ టెక్​ గిఫ్ట్స్​.. మీ జీవితంలోని మహిళల కోసం!
5 బెస్ట్​ టెక్​ గిఫ్ట్స్​.. మీ జీవితంలోని మహిళల కోసం! (HT TECH)

women's day gifts under 10000 : అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకా 2,3 రోజుల సమయమే ఉంది. ఈ సందర్భంగా.. చాలా మంది.. తమ జీవితాల్లోని మహిళలకు ఏదో ఒక గిఫ్ట్​ ఇవ్వాలని ప్లాన్​ చేస్తున్నారు. ఫోన్స్​, గ్యాడ్జెట్స్​ వంటివి చూస్తున్నారు. అయితే.. మార్కెట్​లో చాలా ఆప్షన్స్​ ఉండటంతో కన్ఫ్యూజ్​ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. రూ. 10వేలలోపు ఇవ్వగలిగే ది బెస్ట్​ గిఫ్ట్స్​ లిస్ట్​ను మీకోసం మేము రూపొందించాము. మీరూ ఓ లుక్కేయండి..

ట్రెండింగ్ వార్తలు

ఇన్ఫీనిక్స్​ నోట్​ 12ఐ..

Infinix note 12i : రూ. 10వేల బడ్జెట్​లో చాలా స్మార్ట్​ఫోన్స్​ లభిస్తున్నాయి. వీటిల్లో ఇన్ఫీనిక్స్​ నోట్​ 12ఐ ప్రత్యేకం. ఇందులో 6.7 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్​ హీలియో జీ85 చిప్​సెట్​, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటివి దీని సొంతం. ఈ మొబైల్​ ధర రూ. 9,999 మాత్రమే. బెస్ట్​ డీల్​!

బోట్​ ఎక్స్​టెండ్​ స్మార్ట్​వాచ్​..

Boat Xtend Smartwatch price : ఈ బడ్జెట్​ స్మార్ట్​వాచ్​ ధర మరింత తగ్గింది! రూ. 7,990గా ఉండే ఈ స్మార్ట్​వాచ్​.. అమెజాన్​, క్రోమా, విజయ్​ సేల్స్​లో లభిస్తున్న ఆఫర్లతో రూ. 2,299కే వస్తోంది. ఇందులో 1.69 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే, 50 వాచ్​ ఫేసెస్​, హార్ట్​ రేట్​ ట్రాకర్​, ఎస్​పీఓ2, స్లీపింగ్​ పాటర్న్​ ట్రాకర్​ వంటి ఫీచర్స్​ లభిస్తున్నాయి.

జబ్రా ఇలైట్​ 4 యాక్టివ్​..

Jabra Elite 4 Active price : జబ్రా ఇలైట్​ 4 యాక్టివ్​లో మైక్రోఫోన్​, యాక్టివ్​ నాయిస్​ కాన్సిలేషన్​ సెటప్​, బ్లూటూత్​ 5.2 కనెక్టివిటి వంటివి వస్తున్నాయి. ఇదొక ఐపీ57 రేటింగ్​ డివైజ్​. అమెజాన్​లో దీని ధర రూ. 6,999గా ఉంది.

గూగుల్​ పిక్సెల్​ బడ్స్​ ఏ- సిరీస్​..

Google Pixel Buds A series : ఇది కూడా ఒక హెడ్​సెటే. గూగుల్​ అసిస్టెన్స్​తో వస్తున్న ఈ డివైజ్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 7999గా ఉంది. ఇందులో 12ఎంఎం డైనమిక్​ డ్రైవర్స్​, బ్లూటూత్​ వర్షెన్​ 4, ఐపీఎక్స్​4 రేటింగ్​, పాసివ్​ నాయిస్​ రిడక్షన్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.

కిండిల్​ పేపర్​వైట్​..

Kindle Paperwhite price in Amazon : ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే.. వారికి ఇది ది బెస్ట్​ గిఫ్ట్​..! కిండిల్​ పేపర్​వైట్​ ధర అమెజాన్​లో రూ. 9999గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మార్చ్​ 8ని అంతర్జాతీయ మహిళల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈలోపు మీకు నచ్చనవారికే మంచి మంచి గిఫ్ట్స్​ కొని సర్​ప్రైజ్​ చేసేయండి మరి..

WhatsApp channel