Happy Slap Day: ప్రేమించి మోసం చేసిన మీ మాజీ లవర్‌ని చాచి పెట్టి ఒక్కటి కొట్టే రోజు ‘హ్యాపీ స్లాప్ డే’
Happy Slap Day: వాలెంటైన్స్ డే అయిపోయింది. ఇప్పుడు యాంటీ వాలెంటైన్స్ వీక్ స్టార్ట్ అయింది. అందులో మొదటిది హ్యాపీ స్లాప్ డే. ఈ రోజు ఎవరికి కొట్టాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి.
Happy Slap Day: వాలెంటైన్స్ డేకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, యాంటీ వాలెంటైన్స్ వీక్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్‌ను నిర్వహించుకుంటారు. ప్రేమలో ఉన్నవారు వాలెంటైన్స్ డే ను వైభవంగా జరుపుకుంటే, ప్రేమలో మోసపోయిన వారు యాంటీ వాలెంటైన్స్ వీక్‌ను నిర్వహించుకుంటారు. అలాగే ప్రేమ వివాహాలకు, ప్రేమకు వ్యతిరేకులు కూడా ఈ వాలెంటైన్స్ వీక్ ను నిర్వహించుకుంటారు. వాలెంటైన్స్ డే పూర్తయిన వెంటనే ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ మొదలైపోతుంది. వాలెంటైన్స్ డే లో కౌగిలింతలు, ముద్దులు, అందమైన వాగ్దానాలు ముఖ్యాంశాలుగా ఉంటే ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ లో మాత్రం చెంప మీద కొట్టడం, తప్పు ఒప్పుకునేలా చేయడం, బ్రేకప్ చేసుకోవడం వంటివి ఉంటాయి.
యాంటీ వాలెంటైన్స్ వీక్
ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ ఉంటుంది. ఇందులో మొదటిది స్లాప్ డే. అంటే మిమ్మల్ని మోసం చేసిన మాజీ లవర్‌ని చాచిపెట్టి ఒక్కటి కొట్టే రోజు. ఇక మరుసటి రోజు కిక్ డే నిర్వహించుకుంటారు. ఆ తరువాత పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే... చివరిగా బ్రేకప్ డే నిర్వహిస్తారు. ఈరోజు హ్యాపీ స్లాప్ డే.
స్లాప్ డే రోజు ఏం చేయాలి?
స్లాప్ డే వెనుక పెద్దగా చరిత్ర ఏమీ లేదు. ప్రేమించి మోసపోయిన వ్యక్తులు తమ మాజీ లవర్‌కు తమ కోపాన్ని ప్రదర్శించే రోజు. వారిని ఒక చెంప దెబ్బ కొట్టడం ద్వారా తమ కోపాన్ని వారు ఈ రోజు నుంచి విడిచిపెడతారు. స్లాప్ డే నిర్వహించుకున్నాక ఇక మాజీ లవర్ పై ఎలాంటి కోపాన్ని, ప్రేమను మనసులో ఉంచుకోరు. విషపూరిత జ్ఞాపకాలను వదిలేస్తారు. బాధాకరమైన అనుభవాలను, భావోద్వేగాలను విడిచిపెడతారు. తమని తాము ప్రేమించుకోవడం ప్రారంభిస్తారు.
వాలెంటైన్స్ డే పూర్తయిన మరుసటి రోజు ఈ స్లాప్ డే వస్తుంది. ముందు రోజు ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఉంటే, మరుసటి రోజు ప్రేమలో మోసపోయిన వారు పగ తీర్చుకునే రోజు అని చెప్పాలి. పగ అంటే హింసాత్మకంగా ఉండదు. చెంపపై ఒక్క దెబ్బ కొట్టి తమ పగను పూర్తి చేసుకుంటారు.
ఇంతవరకు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు హఠాత్తుగా వదిలి వెళ్ళిపోతే ఆ బాధ ఆ ప్రేమించిన మనసుకే తెలుస్తుంది. మోసం చేసిన వ్యక్తిని మనసారా తిట్టాలని అనుకుంటారు. అలాంటి వ్యక్తుల కోసమే ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్. ఒకరి శ్వాసలో మరొకరు శ్వాసగై సాగాలనుకున్నవారు... హఠాత్తుగా విడిపోతే, అందులో ఒకరు మాత్రమే దుర్బుద్ధితో మోసం చేస్తే... ఆ బాధ భరించడం చాలా కష్టం. ఒక్క చెంప దెబ్బతో తమ మధ్య ఉన్న ద్వేషాన్ని మరిచిపోయేలా చేయడమే ఈ హ్యాపీ స్లాప్ డే ఉద్దేశం.
టాపిక్