Running Day । హృదయపూర్వకంగా పరుగెత్తండి.. పరుగుతో మీ గుండెకు కలిగే ప్రయోజనాలు ఇవే!-global running day 2023 global running day 2023 know how running improves your heart health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Running Day । హృదయపూర్వకంగా పరుగెత్తండి.. పరుగుతో మీ గుండెకు కలిగే ప్రయోజనాలు ఇవే!

Running Day । హృదయపూర్వకంగా పరుగెత్తండి.. పరుగుతో మీ గుండెకు కలిగే ప్రయోజనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 09:26 AM IST

Global Running Day 2023: ఈరోజు గ్లోబల్ రన్నింగ్ డే, ప్రతీ ఏడాది జూన్ 7న దీనిని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ రన్నింగ్ కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ఉద్దేశ్యించిన ఒక రోజు.

Running benefits
Running benefits (Pexels)

Global Running Day 2023: పరుగును కూడా నడకకు మరొక రూపాంతరంగా చెబుతారు. మనం నడిచేటపుడు ఒక వేగంతో ముందుకు కదులుతే, పరుగుతీసేటపుడు మన కదలికలో మరింత వేగం పెరుగుతుంది, మరింత త్వరగా ప్రదేశాన్ని మారతాం. పరుగుతో మరింత శక్తి వినియోగం జరుగుతుంది. అందుకే పరుగును కూడా ఒక ఏరోబిక్ వ్యాయామంలా పేర్కొంటారు.

ఈరోజు గ్లోబల్ రన్నింగ్ డే, ప్రతీ ఏడాది జూన్ 7న దీనిని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ రన్నింగ్ కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ఉద్దేశ్యించిన ఒక రోజు. అన్ని వర్గాల ప్రజలు ఒక చోటకు చేరి పరుగును వేడుకగా జరుపుకునేందుకు, పరుగు పందాల క్రీడలలో పాల్గొనేందుకు ఒక యూనివర్సల్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. తద్వారా ప్రజలు పరుగును తమ జీవనశైలిలో ఒక దినచర్యగా మార్చుకొని, మరింత చురుకైన జీవన విధానాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తుంది.

పరుగెత్తడం వలన శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రోజూ కొద్దిసమయం పరుగెత్తడం అలవాటుగా చేసుకుంటే హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ గుండెకు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో తెలుసుకోండి.

రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది

పరుగెత్తడం వలన రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. దీనిని డెన్సిటీ లిపోప్రొటీన్ లేదా హెచ్‌డిఎల్ అంటారు. ఈ కొలెస్ట్రాల్ రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

రక్తం గడ్డకట్టడం తగ్గిస్తుంది

రన్నింగ్ రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గిస్తుంది. ఈ రకంగా ఇది ఆకస్మిక గుండెపోటుకు ప్రేరేపించే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కరోనరీ కొలేటరల్స్ పెరుగుతాయి

కరోనరీ కొలేటరల్‌లను పెంచడంలో రన్నింగ్‌తో సహా వ్యాయామాలు సహాయపడతాయి. కరోనరీ కొలేటరల్‌లు వివిధ గుండె ధమనుల మధ్య చక్కటి కనెక్షన్లు. ఆ కొలేటరల్‌ల పెరుగుదల వలన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడం లేదా ఇతర ధమనుల సమస్య ద్వారా గుండెకు నష్టం జరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇవి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పరుస్తాయి.

మానసిక ఆరోగ్యం పెంచుతుంది

రెగ్యులర్ గా రన్నింగ్‌ చేయడం వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. రన్నింగ్ చేసేటప్పుడు, మనస్సు రోజువారీ ఆందోళనల నుండి డైవర్ట్ అవుతుంది. ఇది ఒత్తిళ్లను తగ్గించి మానసిక ప్రశాంతతను అందివ్వడంలో సహాయపడుతుంది, తద్వారా గుండెపై మానసిక ఒత్తిడి దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.

రన్నర్‌లు కానివారు లేదా కఠినమైన వ్యాయామాలు చేసే అలవాటు లేని వ్యక్తులు లేదా ఏదైనా అనారోగ్య సమయ్సాలు ఉన్నవారు రన్నింగ్ చేసే ముందు వైద్యుల సలహా తీసుకోండి. పరుగెత్తడానికి బదులు చురుకైన నడక, జాగింగ్, స్విమ్మింగ్ లేదా ఇతర ఏరోబిక్ వ్యాయామాలు కూడా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం