Garlic Pickle: వెల్లుల్లి ఊరగాయ రెసిపీ ఇదిగో, ఆరోగ్యానికి దీన్ని తినడం చాలా అవసరం
Garlic Pickle: వెల్లుల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దాని రుచి నచ్చక చాలా మంది తినరు. ఇక్కడ మేము వెల్లుల్లి ఊరగాయ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
Garlic Pickle: తెలుగిళ్లలో ఆవకాయలు, నిల్వ పచ్చళ్ళు అధికంగా ఉంటాయి. ఏ కూర ఉన్నా కూడా పచ్చడితో ఒక ముద్ద తింటేనే భోజనం పూర్తయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లి ఊరగాయ రెసిపీని ఇచ్చాము. మామిడికాయలాగే వెల్లుల్లి ఆవకాయను కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం చాలా సులువు. వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి రోజులో రెండు వెల్లుల్లి పాయలైన తినడం చాలా అవసరం. ఈ వెల్లుల్లి ఆవకాయను అన్నంలో కలుపుకొని ఓ రెండు వెల్లుల్లిపాయలను తినేయండి. మీకు కావాల్సిన రోగనిరోధక శక్తి శరీరంలో చేరుతుంది. ఏ ఇన్ఫెక్షన్ అయినా వైరస్‌లతో పోరాడే శక్తి మీ శరీరానికి వస్తుంది. ఇక వెల్లుల్లి ఊరగాయ ఎలా పెట్టాలో చూద్.దాం
వెల్లుల్లి ఆవకాయ రెసిపీకి కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - పావు కిలో
మెంతులు - రెండు స్పూన్లు
ఆవాలు - నాలుగు స్పూన్లు
కారం - నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నువ్వుల నూనె - ఒక కప్పు
వెల్లుల్లి ఊరగాయ రెసిపీ
1. వెల్లుల్లి ఊరగాయ రెసిపీ చేయడానికి ముందుగా ఆవాలు, మెంతులు కలిపి పొడి చేసుకోవాలి.
2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు వేయించాలి.
3. అందులోనే ఆవాలను కూడా వేసి వేయించుకోవాలి.
4. ఈ రెండింటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కారం, ఆవాలు-మెంతి పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.
6. అందులోనే ఒక కప్పు నూనెను వేసి బాగా కలిపి గాలి చొరబడని ఒక గాజు సీసాలో వేయాలి.
7. ఆ తర్వాత దాన్ని రెండు వారాలపాటు అలా ఉంచాలి.
8. మూడు నాలుగు రోజులకు ఒకసారి ఓపెన్ చేసి గరిటతో కలుపుతూ ఉండాలి.
9. రెండు వారాల తర్వాత టేస్టీ వెల్లుల్లి ఆవకాయ్ రెడీ అయిపోతుంది.
10.దీన్ని వాసన తినేయాలని కోరికను పెంచుతుంది.
11. ఈ రెసిపీ కోసం మీరు నువ్వుల నూనె వాడితే మంచిది. వెల్లుల్లి ఊరగాయకు మరింత పోషకాలు అందుతాయి.
ఈ వెల్లుల్లి ఊరగాయ లేదా వెల్లుల్లి ఆవకాయను పప్పు అన్నం తింటున్నప్పుడు లేదా పెరుగన్నానికి జోడీగా తింటే బావుంటుంది. అలాగే దోశ, ఇడ్లీలకి జతగా తింటే రుచి అదిరిపోతుంది. వేడి అన్నంలో ఈ వెల్లుల్లి ఆవకాయను వేసుకొని కలుపుకొని చూడండి. టేస్ట్ మామూలుగా ఉండదు. ఇందులో కాస్త నెయ్యి కూడా జోడించుకుంటే రుచి అదిరిపోతుంది.
టాపిక్