Ganesh Chaturthi Rituals : వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి 10 రోజుల పాటు భక్తులు పూజిస్తారు. 11వ రోజు వినాయకుని నిమజ్జనానికి సిద్ధమవుతారు. అందమైన ఊరేగింపు తర్వాత గణేశుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే పదకొండు రోజులు పూజలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. వినాయకుని పూజ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. పూజలో కచ్చితంగా చేయవలసినవి, చేయకూడనివి తెలుసుకుని వాటిని పాటించి.. వినాయకుడిని ఇలా ప్రసన్నం చేసుకోండి.
* ఆచారాల ప్రకారం.. భక్తులు గణపతిని 1.5 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 లేదా 11 రోజులు ఇంట్లో ఉంచుకోవచ్చు. అనంతరం వాటిని నిమజ్జనం చేయవచ్చు లేదా.. దగ్గర్లోని మండపానికి తీసుకువెళ్లి అక్కడ ఉంచవచ్చు. తద్వారా గణేశునికి మరిన్ని పూజలు అందుతాయి అంటారు.
* స్వామిని అతిథిగా పరిగణిస్తారు కాబట్టి.. కుటుంబలో ఎవరికైనా వడ్డించే ముందు ఆహారం, నీరు లేదా ప్రసాదం ఇలా ప్రతిదీ ముందు వినాయకునికి సమర్పించాలి.
* స్వామికి సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి.. ముందుగా విగ్రహానికి నైవేద్యంగా సమర్పించి తర్వాత సేవించండి.
* మట్టి విగ్రహాన్ని పెట్టుకుంటే చాలా మంచిది.
* మీ ఇంటి దగ్గర చెరువు లేకుంటే.. మీ ఇంట్లో ఉన్న వినాయక విగ్రహాన్ని డ్రమ్ములో లేదా బకెట్‌లో నిమజ్జనం చేయండి. నిమజ్జనానికి ముందు ఆయనకు హారతి, ప్రసాదం సమర్పించండి.
* భక్తులు, వారి కుటుంబ సభ్యులు గణపతి స్థాపన తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి.
* సదుద్దేశంతో పూజను మనస్పూర్తిగా నిర్వహించాలి. నివాసంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి.
* గణేశునికి హారతి, పూజ, ప్రసాదం సమర్పించకుండా నిమజ్జనం చేయవద్దు.
* గణపతి స్థాపనను ఆలస్యం చేయకండి. ముహూర్తాన్ని అనుసరించండి.
సంబంధిత కథనం