హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి జరుపుకుంటారు. గణేష్ మహోత్సవం చతుర్థి తిథి నుండి ప్రారంభమై 10 రోజుల పాటు కొనసాగుతుంది. అనంత చతుర్దశి నాడు నిమజ్జనోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31, బుధవారం నాడు వస్తుంది. చతుర్థి తిథి ఆగష్టు 30, 2022న మధ్యాహ్నం 03:33 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31, 2022న మధ్యాహ్నం 03:22 గంటలకు ముగుస్తుంది. గణేశ పూజ ముహూర్తం ఉదయం 11:06 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 01:40 గంటలకు ముగుస్తుంది.వినాయక నిమజ్జనం అనంత చతుర్దశి నాడు సెప్టెంబర్ 9, శుక్రవారం జరుగుతుంది.
వినాయక చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదు, చూసిన వారు అపనిందలు మోయాల్సి వస్తుందని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది.
2022 ఆగష్టు 31, బుధవారం రోజున ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు శుభ సమయం ఉంది. ఈ ముహూర్తాన గణేశుడిని పూజిస్తే మంచిది. అలాగే ఇదే రోజున ఉదయం 05:58 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు రవియోగం ఉంటుంది. ఈ కాలంలో శుభ కార్యాలు చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
చతుర్థి తిథి ఆగస్టు 30, 2022 మధ్యాహ్నం 03:33 గంటలకు ప్రారంభమవుతుంది. ఆగస్టు 31 మధ్యాహ్నం 03.22 గంటలకు ముగుస్తుంది. పద్మ పురాణం ప్రకారం గణేశుడు మధ్యాహ్న కాలంలో స్వాతి నక్షత్రంలో జన్మించాడు. కాబట్టి ఆగస్టు 31వ తేదీ ఉదయం 11:05 గంటల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 01.38 గంటల వరకు గణపతి ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం. ఈ సమయంలో గణేషుడి ప్రతిష్టించడం, పూజించడం శుభసూచకం.
వినాయకుడు విగ్రహం ఉన్నన్నీ రోజులు దీపధూప నైవేద్యాలు సమర్పిస్తూ, పరిశుద్ధంగా ఉంటూ విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి.]
సంబంధిత కథనం
టాపిక్