Friday Fashion : ట్రెండీ అయినా ట్రెడీషన్ అయినా.. పండుగకి ఇలా రెడీ అయిపోండి..-fashion tips trendy to traditional for women on navratri and bathukamma ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Fashion Tips Trendy To Traditional For Women On Navratri And Bathukamma

Friday Fashion : ట్రెండీ అయినా ట్రెడీషన్ అయినా.. పండుగకి ఇలా రెడీ అయిపోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 23, 2022 10:40 AM IST

Friday Fashion Tips for Festival :దసరా దాదాపు దగ్గర్లో ఉంది. పండుగ అంటే ఎవరు ఎలా ఉన్నా.. మహిళలు, అమ్మాయిలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అంతేనా తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకుమ్మ కూడా దగ్గర్లో ఉంది. అయితే ఈ పండుగ సమయంలో ట్రెండీగా, ఫ్యాషన్ ఎలా తయారవ్వాలి అని కంగారు పడిపోతున్నారా? అయితే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..

పండుగ ఫ్యాషన్
పండుగ ఫ్యాషన్

Friday Fashion Tips for Festival : బతుకమ్మ, దసరా కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. నవరాత్రి, బతుకమ్మను తొమ్మిది రోజులు చేస్తారు. అయితే ఈ సమయంలో అందరూ ట్రెడీషనల్​గా కనిపించేందుకు మొగ్గుచూపుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా చేసుకుంటారు. పైగా దసరా, బతుకమ్మ రెండూ ఆడవారికి ప్రధానమైన పండుగలే. అయితే ఈ సమయంలో ఎలాంటి డ్రెస్ ధరించాలి. ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు, స్టైల్స్‌తో విభిన్నమైన రూపాన్ని కలిగి ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే కొన్ని ఫ్యాషన్ చిట్కాలను తీసుకొచ్చాము. చదివేయండి. పండుగకి వాటిని ఫాలో అయిపోండి.

కో-ఆర్డర్ సెట్లు

ఈసారి పండుగకు అవాంతరాలు లేని, కూల్ దుస్తుల్లో ఒకటైనా కో-ఆర్డ్ సెట్‌లు మీరు ఎంచుకోవచ్చు. దానికోసం గంటలు గంటలు సమయం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ పండుగకు తగిన, స్టైలిష్​గా, సౌకర్యవంతమైన రెడీమేడ్ డ్రెస్​ ధరించాలంటే కో-ఆర్డర్ సెట్లు ఎంచుకోండి.

స్ట్రెయిట్ ప్యాంట్ కో-ఆర్డ్ సెట్ ఉన్న క్రాప్ టాప్ లేదా మెర్మైడ్-స్టైల్ క్రాప్ టాప్ కో-ఆర్డ్ సెట్ ఉన్న రఫుల్ స్కర్ట్‌ని ఎంచుకోండి.

కార్గో ప్యాంటు

ఆధునిక వార్డ్‌రోబ్ స్టేపుల్స్‌లో ఒకటైన కార్గో ప్యాంటు ఈ పండుగ సమయంలో తప్పనిసరిగా ఉండాలి. అవి మీకు సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా కూల్‌గా, రిలాక్స్‌గా, స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి. అంతేకాకుండా ఇవి పండుగకు, ఫ్యాషన్​ని జోడిస్తాయి.

బహుళ పాకెట్స్, టేపర్డ్ చీలమండలతో ముదురు రంగు కార్గో ప్యాంట్‌లను కొనుగోలు చేయండి. వాటిని క్లాసిక్ వైట్ బటన్-డౌన్ టీ-షర్ట్ లేదా స్టేట్‌మెంట్ బ్లౌజ్, చిక్ జ్యువెలరీ, ముదురు రంగు బూట్‌లతో జత చేయండి.

సరళమైన, సొగసైన మోనోటోన్ లెహంగా

మీ పండుగలో మోనోక్రోమటిక్ లుక్ కావాలి అనుకుంటున్నారా? అయితే అత్యంత అధునాతనమైన మోనోటోన్ లెహంగాని మీ పండుగ స్టైల్​లో యాడ్ చేయండి. ఇది పండుగకు సెట్​ అయ్యే గొప్ప ట్రెడీషనల్​ దుస్తుల్లో ఒకటి.

ఈ సింగిల్-కలర్ లెహంగాలు ఉబెర్-సింపుల్​గా ఉంటాయి. ఇవి హుందాగా, స్టైలిష్‌గా కూడా ఉంటాయి. మీరు పౌడర్ బ్లూ వంటి పాస్టెల్ షేడ్స్‌ను ఎంచుకోవచ్చు. చంకీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో మీ రూపాన్ని మరింత స్టైల్​గా తీర్చిదిద్దవచ్చు.

బనారసీ సిల్క్ దుపట్టా

మీ పండుగ సమయంలో మీ ఫ్యాషన్​కి రిచ్​ లుక్​ ఇవ్వాలంటే.. లెహంగా సెట్‌ని, చీరను కట్టుకోవడం ఇష్టం లేకుంటే.. మీరు మంచి రంగు బనారసీ సిల్క్ దుపట్టాతో మీ కుర్తాకు రిచ్ లుక్ ఇవ్వొచ్చు. మంచి జ్యూవెలరీతో రాయల్ టచ్‌ని పెంచవచ్చు. అవి తేలికగా ఉంటాయి. బేసిక్ కాటన్ కుర్తాను కూడా గ్రాండ్​గా మార్చేస్తాయి.

చక్కని సొగసైన చీర తప్పనిసరి

చీర లేకుండా జరిగే ఏ పండుగైనా అంసపూర్ణమనే చెప్పవచ్చు. చీరకి అంతటి ప్రాధన్యత ఇవ్వడంలో కూడా తప్పులేదు. మీరు చీరను సంప్రదాయంగా, స్టైలిష్​గా కూడా ఎంచుకోవచ్చు. కట్టుకోవచ్చు. వైబ్రంట్-హ్యూడ్ టస్సార్ సిల్క్ చీర, లేదా సులభంగా నిర్వహించగలిగే కాటన్ చేనేత చీర లేదా మీ మనసుకు నచ్చిన చీరను ఎంచుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం