APSRTC MD :దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే...
పండుగ ప్రయాణాలపై ఎలాంటి అదనపు భారం వేయట్లేదనిAPSRTC MD ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. ఈ ఏడాది దసరా ప్రత్యేక సర్వీసులల్లో ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయట్లేదని ప్రకటించారు.దాదాపు పదేళ్ల తర్వాత ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా పండుగ ప్రయాణాలు చేసే అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసి కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది దసరా పండక్కి 4500 ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఆర్టీసి ఏర్పాటు చేసింది. ఒక్క విజయవాడ రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెయ్యి సర్వీసుల్ని నడుపుతున్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయం కంటే పండుగ సమాయాల్లో టిక్కెట్ ధరలు పెంచుతారనే అపవాదు ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది టిక్కెట్ ధరలు పెంచకూడదని నిర్ణయించినట్లుAPSRTC MD ఎండీ చెప్పారు.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి పండుగ ప్రయాణాల కోసం ప్రత్యేక బస్సుల్ని సిద్ధం చేస్తున్నట్లుAPSRTC MDఎండీ చెప్పారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఓ వైపు ప్రయానాల కోసం 2100 బస్సుల్ని నడుపుతారు. అక్టోబర్ 5 నుంచి 9వ తేదీ వరకు 2,400 బస్సుల్ని నడుపనున్నారు. పండుగ రద్దీని తట్టుకునేలా వీటికి షెడ్యూల్ రూపొందించారు.
హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి అంతరాష్ట్ర సర్వీసులతో పాటు రాష్ట్రంలోని 21 నగరాలు, ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సుల్ని నడుపనున్నారు. అన్ని సాధారణ, ప్రత్యేక సర్వీసుల్లో యూటీఎస్ విధానాన్ని అమలు చేస్తారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్, క్యూర్ కోడ్ స్కాన్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసి బస్సులన్నింటిలో జిపిఎస్ ట్రాకింగ్ అమర్చారు. వీటిని 24 గంటలు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. పండుగ సమయంలో నిబంధనలు పాటించకుండా నడిపే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని నిరోధించడానికి పోలీస్, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
దసరా నాటికి 'స్టార్ లైనర్ ' పేరిట నాన్ ఎసీ స్లీపర్ సర్వీసులను ప్రారంభిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. దశలవారీగా మొత్తం 62 స్టార్ లైనర్ బస్సుల్ని రోడ్డెక్కిస్తామన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు ఈ బస్సులు నడపనున్నట్లు చెప్పారు.ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే ఛార్జీలనే ప్రత్యేక బస్సుల్లో వసూలు చేయనున్నారు.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, ఈ బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. ప్రయోగాత్మకంగా కొత్త విధానంలో ఈ సారి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్న ఎండీ మంచి ఫలితాలు వస్తే కొనసాగిస్తామని, లేదంటే పాత విధానం అమలు వైపు ఆలోచిస్తామన్నారు. ప్రయాణికుల ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు APSRTC MD తెలిపారు.
ప్రయాణికులు 0866-2570005 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చని APSRTC MD పేర్కొన్నారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు దసరా నాటికి 'స్టార్ లైనర్' పేరిట నాన్ ఎసీ స్లీపర్ సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1న పీఆర్సీ మేరకు పెంచిన వేతనాలు ఇవ్వనున్నట్లు ఎండీ తెలిపారు. పదోన్నతులు పొందిన 2వేల మంది ఉద్యోగులకు అక్టోబర్లో పాత వేతనాలే ఇస్తామని, ఆమోదం అనంతరమే పెంచిన వేతనాలు ఇవ్వనున్నట్లు ఎండీ స్పష్టం చేశారు.
టాపిక్