tomato omelette: ఎగ్‌లెస్ టమాటా ఆమ్లెట్..బోలెడు కూరగాయలతో..
tomato omelette: అల్పాహారంలో ఎక్కువ ప్రొటీన్ ఉండేలా ఏం తినొచ్చో ఆలోచిస్తున్నారా? అయితే శనగపిండితో టమాటా ఆమ్లెట్ ప్రయత్నించి చూడండి.
శాకాహారులు ప్రొటీన్ కోసం వివిధ ప్రత్యామ్నాయాల కోసం చూస్తుంటారు. మీరు కూడా అదే జాబితాలో ఉంటే ఈ అల్పాహారం మీకోసమే. కూరగాయ ముక్కలు, శనగపిండితో చేసే ఈ ఎగ్‌లెస్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
శనగపిండి - 1 కప్పు
సన్నగా తరిగిన టమటా ముక్కలు - 1 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 టీస్పూను
సన్నగా తరిగిన కొత్తిమీర - కొద్దిగా
సన్నగా తరిగిన అల్లం - 1 టీస్పూను
కారం - 1 టేబుల్ స్పూను
పసుపు - పావు టీస్పూను
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
బేకింగ్ పౌడర్ - పావు టీస్పూను
తయారీ విధానం:
step1: టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని, సన్నగా తరిగిన కొత్తిమీరను ఒక పెద్ద గిన్నెలో తీసుకోండి.
step2: కూరగాయ ముక్కల్లో శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, బేకింగ్ పౌడర్ కూడా వేయాలి. కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి ఉండలు కట్టకుండా విస్కర్ తో కలపుతూ ఉండాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు. ఒక రెండు నిమిషాలు ఆపకుండా కలుపుతూ ఉండండి.
step3: పెనాన్ని వేడి చేసుకుని రెండు టీస్పూన్ల నూనెను పెనం అంతటా రాయండి. మీడియం మంట మీద పెట్టుకుని ఒక పెద్ద చెంచాతో పిండిని పోసుకోవాలి. చెంచా వెనక భాగంతో పిండిని దోసెలాగా కాకుండా కాస్త మందంగా వేసుకోండి.
step4: సగం టీస్పూను నూనెను అంచుల వెంబడి వేయండి. కాస్త రంగు మారాక మరోవైపు వేసి కాల్చుకోండి.
ఈ టమాటో ఆమ్లెట్ ను బ్రెడ్‌తో కానీ, టమాటా సాస్ తో లేదా కొత్తిమీర, పుదీనా చట్నీతో నంచుకుని తిన్నా చాలా బాగుంటుంది.