Spanish Omelette : స్పానిష్ ఆమ్లెట్.. ఇలా తయారు చేసుకోవచ్చు-breakfast recipes how to make spanish omelette for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakfast Recipes How To Make Spanish Omelette For Breakfast

Spanish Omelette : స్పానిష్ ఆమ్లెట్.. ఇలా తయారు చేసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu
Apr 02, 2023 06:30 AM IST

Spanish Omelette Making : కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్లతో చేసే వంటలు రుచిగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. కొత్తగా స్పానిష్ ఆమ్లెట్ ట్రై చేయండి. అల్పాహారంలోకి బాగుంటుంది.

స్పానిష్ ఆమ్లెట్
స్పానిష్ ఆమ్లెట్

కోడిగుడ్లను తింటే.. ఆరోగ్యానికి మంచిది. రుచితోపాటుగా ఆరోగ్యంగా ఉంటారు. కోడిగుడ్లతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అందులో ఒకటి స్పానిష్ ఆమ్లెట్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లాగా తీసుకుంటే చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే.. స్పానిష్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు..

నూనె-5 టేబుల్ స్పూన్స్, బంగాళాదుంప‌లు-2, త‌రిగిన ఉల్లిపాయ ఒకటి, కోడిగుడ్లు-6, ఉప్పు త‌గినంత‌, మిరియాల పొడి-అర టీ స్పూన్.

మెుదట బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసుకోవాలి. తర్వాత పలుచగా కట్ చేసుకోవాలి. మరోవైపు ఓ గిన్నెలో కోడిగుడ్లను వేసి.. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాల్సి ఉంటుంది. నూనె వేడి అయిన తర్వాత.. అందులో బంగాళాదుంపను వేయించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత.. ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత.. వీటిని నూనె లేకుండా.. ముందుగా సిద్ధం చేసుకున్న కోడిగుడ్డులో మిశ్రమంలో కలపాలి. ఇందులో ఉప్పు, మిరియాల పొడి బాగా వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించిన కళాయిని స్టౌవ్ మీద పెట్టి వేడి చేయాలి.

నూనె వేడి అయిన తర్వాత.. సిద్ధం చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేయాలి. దీని మీద మూత పెట్టి.. ఎనిమిది నిమిషాలపాటు మంటపై ఉడికించాలి. తర్వాత ఆమ్లెట్ విరిగిపోకుండా.. మరోవైపునకు తిప్పుకోవాలి. మరి కాసేపు వేయించుకున్న తర్వాత.. ప్లేట్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉండే.. స్పానిష్ ఆమ్లెట్ తయారవుతుంది. టమాట కిచప్ లో కలుపుకొని తినొచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం