Before Gym Foods : జిమ్‌కు వెళ్లేముందు ఇవి తింటే రెట్టింపు ప్రయోజనాలు
Before Gym Foods In Telugu : జిమ్‌కు వెళ్లడం కంటే ముందుగా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. అప్పుడే మీరు ఫిట్‌గా ఉంటారు. ఆ ఆహారాలు ఏంటో చూద్దాం..
మిమ్మల్ని మీరు పూర్తిగా ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మీ ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యాయామం ఎప్పుడూ ఖాళీ కడుపుతో చేయకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. మీరు వ్యాయామం చేయాలనుకుంటే మీ ఆహారంలో ఏమి చేర్చాలో తెలుసుకోవాలి. అలా అని ఏది పడితే అది తినేసి వ్యాయామం చేసేందుకు వెళ్లడం కూడా కరెక్ట్ కాదు. మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే జిమ్ చేసిన ప్రయోజనాలు మీ శరీరానికి దక్కుతాయి. జిమ్ చేసేందుకు వెళ్లడం కంటే ముందు ఈ ఆహారాలను తినండి
ఓట్స్ తినాలి
వ్యాయామం మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. వ్యాధులను దూరం చేస్తుంది. ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. ఖాళీ కడుపుతో జిమ్‌కి వెళ్లకూడదు. జిమ్‌కు ముందు ఓట్స్ తినాలి. దీని కారణంగా ఆకలి ఎక్కువగా వేయదు. ఇందులో విటమిన్-బి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఓట్స్ తింటే బరువు కూడా తగ్గుతారు. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి.
అరటి పండ్లు
జిమ్‌కి వెళ్లే ముందు తప్పనిసరిగా అరటిపండ్లు తినాలి. ఇది మీ శరీరంలో శక్తిని సృష్టిస్తుంది. దీని కారణంగా శరీరంలో శక్తి నిర్వహించబడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి అరటిపండ్లు పనిచేస్తాయి. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుండి తక్షణమే ఉపశమనం పొందడంలో కూడా చాలా సహాయకారిగా నిరూపిస్తుంది. అరటి పండ్లు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..
ఉడికించిన గుడ్లు
జిమ్‌కు వెళ్లే ముందు గుడ్లు తినాలి. ఇది ప్రోటీన్ కోసం ఉత్తమంగా పరిగణిస్తారు. ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని బలంగా ఉంచడంలో, బలహీనతను తొలగించడంలో సహాయకారిగా ఉంటుంది. మీకు కావాలంటే ఉడికించిన గుడ్లు తినవచ్చు. కొందరు పచ్చి గుడ్డును నేరుగా తాగేస్తారు. ఇలా చేస్తే కొందరికి పడకపోవచ్చు. మీ శరీరానికి ఏది సెట్ అవుతుందో దానినే తీసుకోవాలి.
డ్రై ఫ్రూట్స్
ప్రతి రోజూ ఉదయం డ్రై ఫ్రూట్స్ తినాలి. దీని వలన శరీరం ఎప్పుడూ బలహీనపడదు. అన్ని రోగాలను దూరం చేయడానికి వీటిని తినవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జిమ్‌కి వెళ్లే ముందు మీరు కొద్ది మెుత్తంలో తినొచ్చు. ఎక్కువగా తినకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు.
చికెన్
మీరు ఉడికించిన చికెన్ కూడా తినవచ్చు. ఇది తక్షణమే శరీరాన్ని శక్తిని నింపుతుంది. కండరాలను బలోపేతం చేయడానికి మీరు దీన్ని తినాలి. నల్ల మిరియాలు, ఉప్పుతో కలిపి చికెన్ తినవచ్చు. ఇది రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వర్కవుట్ చేయడానికి ముందు తినాలి. అయితే ఆయిల్ ఫ్రై చేసిన చికెన్ మాత్రం జిమ్ వెళ్లేముందు అస్సలు తినకూడదు. ఇది తింటే ఆరోగ్యానికి మంచిది కాదు.
జిమ్ వెళ్లేముందు తినే ఆహారం మితంగా ఉండాలి. అతిగా తింటే మీరు వర్కౌట్స్ సరిగా చేయలేరు. నూనెలో వేయించిన ఆహారాలు తినకపోవడమే మంచిది.