Rare Fruit: ఈ పండ్లు పేరేమిటో తెలుసా? ఇవి కనిపిస్తే వెంటనే కొనుక్కొని తినేయండి, వచ్చే ఏడాదికి ఇవి అంతరించిపోవచ్చు-do you know the name of these fruits kokum fruits may be extinct by next year ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rare Fruit: ఈ పండ్లు పేరేమిటో తెలుసా? ఇవి కనిపిస్తే వెంటనే కొనుక్కొని తినేయండి, వచ్చే ఏడాదికి ఇవి అంతరించిపోవచ్చు

Rare Fruit: ఈ పండ్లు పేరేమిటో తెలుసా? ఇవి కనిపిస్తే వెంటనే కొనుక్కొని తినేయండి, వచ్చే ఏడాదికి ఇవి అంతరించిపోవచ్చు

Haritha Chappa HT Telugu
May 31, 2024 11:06 AM IST

Kokum: ఇక్కడ ఇచ్చిన ఫోటోలో ఉన్న పండ్లను ఎవరైనా పోల్చారా? ఇవి మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. వీటిని కోకుమ్ అంటారు.

కొకుమ్ పండ్లు
కొకుమ్ పండ్లు

Kokum: కోకుమ్ ఈ పండ్లు మన దేశానికి చెందిన ఉష్ణ మండల పండ్లు. ఇవి చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. జపాన్ కి చెందిన టోక్యో విశ్వవిద్యాలయం, మనదేశానికి చెందిన జెఎన్‌యు, GB పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వారు ఉమ్మడిగా చేసిన అధ్యయనం ప్రకారం... భారతదేశంలో మాత్రమే దొరికే ఈ పండు వచ్చే ఏడాదికల్లా అంతరించిపోయే దశకు చేరుకుంటుంది. అరుదైన పండ్లలో ఒకటిగా మారిపోతుంది. ఈ పండ్లు మనదేశంలో అన్నిచోట్ల పెరగవు. మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పండ్లు సాగుతూ అనుకూలంగా భూమి ఉంటుంది.

బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కోకుమ్‌ను ఇప్పటికే అంతరించిపోతున్న జాబితాలో చేర్చింది. ఇవి అంతరించిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వాతావరణం మార్పు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ఈ పండ్లు తట్టుకోలేకపోతున్నాయి. కొంకణ్ ప్రాంతంలో ఈ పండ్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం అక్కడ కూడా గణనీయంగా వీటి ఉత్పత్తి తగ్గిపోయింది.

కోకుమ్ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా కొనుక్కొని తినండి. వచ్చే ఏడాదికి ఇవి దొరకడం కష్టమైపోతుంది. అంతరించిపోయే దశలోకి ఇవి చేరిపోతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లో శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఎంతో సహాయపడతాయి. వీటిని తరుచూ తినడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది జీర్ణ క్రియ కూడా ఉపయోగపడుతుంది.

ఈ పండ్లలో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆకలిని అధికంగా వేయకుండా అణచివేస్తుంది. దీనివల్ల అధిక ఆహారాన్ని తినడం తగ్గించుకుంటారు. తద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా రావు. దీన్ని రిఫ్రెష్ డ్రింక్ గా తయారు చేసుకుని తాగవచ్చు. మలబద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది.

బరువు తగ్గేందుకు బెస్ట్ ఎంపిక

ఎవరైతే బరువును తగ్గాలనుకుంటున్నారో వారు కోకుమ్ పండ్లను ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ఇది కొవ్వును ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. దీనిలో ఉండే ఎంజైమ్లు కొవ్వు పేరుకు పోవడానికి నిరోధిస్తాయి. అంతేకాదు కోకుమ్ ఆకలిని సహజంగానే అణిచి వేస్తుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గుతారు.

గుండె ఆరోగ్యానికి

కోపంలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. కాబట్టి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఈ పండ్లలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి అవసరం.

కోకుమ్ పండ్లను సాగు చేయాలంటే ఒక నిర్దిష్టమైన వాతావరణంలో ఉండాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు వంటివి విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఈ చెట్లు తట్టుకోలేవు. దీనివల్ల అవి ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. దిగుబడి కూడా తగ్గిపోతుంది.

కోకుమ్ పంటను ప్రధానంగా పశ్చిమ కనుమలలో పండిస్తారు. అయితే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఎక్కువైపోవడంతో అడవులను నిర్మూలించడం ఎక్కువైంది. దీంతో కోకుమ్ చెట్ల మనుగడకు కూడా ముప్పు వాటిల్లింది. అందుకే వాటి ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోయింది.

2025 నాటికి ఈ పండ్లు దొరకడమే కష్టంగా మారిపోతుందని చెబుతున్నారు. అధ్యయనకర్తలు ఇవి పూర్తిగా అంతరించిపోయే ముప్పుని ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. వీటిని కాపాడుకోవాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని, వాటి సాగుకు కొత్త పద్ధతులను ప్రోత్సహించాలని వివరిస్తున్నారు.

Whats_app_banner

టాపిక్