Ghee: స్నానానికి ముందు నాభికి నెయ్యి రాసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?-do you know the benefits of applying ghee on the navel before bathing ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee: స్నానానికి ముందు నాభికి నెయ్యి రాసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Ghee: స్నానానికి ముందు నాభికి నెయ్యి రాసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Haritha Chappa HT Telugu
Oct 29, 2024 02:00 PM IST

Ghee: ఆయుర్వేదం ప్రకారం నాభిని శరీర శక్తి కేంద్రంగా భావిస్తారు. దేశీ నెయ్యిని రోజూ నాభికి అప్లై చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నాభికి నెయ్యి రాయడం వల్ల ఉపయోగాలు
నాభికి నెయ్యి రాయడం వల్ల ఉపయోగాలు (shutterstock)

ఆయుర్వేదం ప్రకారం, నాభి శరీరం యొక్క శక్తి కేంద్రంగా చెప్పుకుంటారు. దేశీ నెయ్యిని రోజూ నాభికి అప్లై చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీ నెయ్యిలో ఉండే విటమిన్ -ఇ, విటమిన్ -ఎ, విటమిన్ -డి, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యంతో పాటూ అందమైన చర్మం పొందాలనే మీ కలను నెరవేరుస్తాయి. దేశీ నెయ్యిని నాభికి అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

నాభికి నెయ్యి పూస్తే ఏమవుతుంది?

నాభికి నెయ్యి పూయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇది చర్మాన్ని తేమగా ఉంచడం ద్వారా చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం ఎల్లవేళలా ప్రకాశవంతంగా ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం, నాభిని జీర్ణక్రియ ప్రదేశంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో నెయ్యి వేయడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు సక్రియం అవుతాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి దేశీ నెయ్యిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం నాభిలో రెండు మూడు చుక్కల నెయ్యి వేసి తేలికగా మసాజ్ చేయాలి. నాభిలో నెయ్యి వేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దకం తొలగిపోతుంది.

కీళ్ల నొప్పులు రాకుండా

కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తరచూ నెయ్యిని వాడడం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కీళ్లనొప్పులు ఉన్నవారు నాభిలో నెయ్యి రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ముందుగా నాభిలో కొన్ని చుక్కల నెయ్యి వేసి నాభి చుట్టూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తొలగిపోయి, వాపు కూడా తగ్గుతుంది.

ఆయుర్వేదం ప్రకారం నాభికి నెయ్యి పూయడం వల్ల వాత దోషం తగ్గిపోతుంది వాతం అసమతుల్యతలో ఉన్నప్పుడు, వ్యక్తి జీర్ణవ్యవస్థలో ఆందోళన, చంచలత, ఆరోగ్య రుగ్మతలు వస్తాయి. కానీ నెయ్యి వాత శక్తిని స్థిరీకరించడం ద్వారా వ్యక్తికి ఎలాంటి సమస్యలు రావు.

నాభి ప్రాంతం భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది. కాబట్టి మానసిక శ్రేయస్సు కోసం నాభి ప్రాంతంలో నెయ్యి రాయడం అలవాటుగా మార్చుకోండి. ధ్యానం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో, నాభికి నెయ్యి రాయడం వల్ల అన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

చర్మం అందంగా మెరవాలనుకుంటే నాభి చుట్టూ నెయ్యితో మర్దనా చేస్తే మంచిది. ప్రతి వారం ఇలా చేస్తే మీ చర్మం మెరుపు కనిపిస్తుంది. చర్మం తేమను కోల్పోకుండా ఉండాలంటే నాభిపై నెయ్యిని అప్లై చేయడం నేర్చుకోవాలి. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.

మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు కచ్చితంగా నాభి చుట్టూ నెయ్యిని మర్ధనా చేసుకోండి. ఇది పొత్తికడుపులో నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అలాగే మొటిమలు కూడా రావు. చర్మానికి ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది.

Whats_app_banner